ప్రధాని మోదీపై పోస్టర్ల వివాదం..ఆ కేసులన్నీ తమ దృష్టికి తేవాలన్న సుప్రీంకోర్టు..పిటిషనర్ కు చీవాట్లు
కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కి సంబంధించి ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్లు అతికించినవారిని అరెస్టు చేసి వారిపై పోలీసులు పెట్టిన కేసులను తమ దృష్టికి తేవాలని సుప్రీంకోర్టు ఓ పిటిషనర్ ని ఆదేశించింది...
కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కి సంబంధించి ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్లు అతికించినవారిని అరెస్టు చేసి వారిపై పోలీసులు పెట్టిన కేసులను తమ దృష్టికి తేవాలని సుప్రీంకోర్టు ఓ పిటిషనర్ ని ఆదేశించింది. వ్యాక్సినేషన్ పాలసీని ప్రశ్నిస్తూ పోస్టర్లు అతికించినవారిపై కేసులు పెట్టరాదని తాము పోలీసులను ఆదేశించలేమని పేర్కొంది. ఏయే వ్యక్తులపై ఈ విధమైన కేసులు దాఖలయ్యాయో వాటిని వారం రోజుల్లోగా తమ దృష్టికి తేవాలని న్యాయమూర్తులు జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ షాలతో కూడిన బెంచ్..ప్రదీప్ కుమార్ అనే పిటిషనర్ ను ఆదేశించింది. ఈ పిటిషనర్ కేవలం వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆధారపడే బదులు మొదట ‘హోంవర్క్’ చేయాల్సి ఉండిందని వారు ఆయనకు పరోక్షంగా చీవాట్లు పెట్టారు. మేము కూడా న్యూస్ పేపర్లు చదువుతామని, లక్షద్వీప్ వివాదానికి, దీనికి పొంతన లేదని వారు చెప్పారు. ఢిల్లీలోనూ, మరికొన్ని చోట్ల కొందరు మోదీని విమర్శిస్తున్నట్టు పోస్టర్లు పెట్టారని, వారిలో 19 ఏళ్ళ యువకుడు, ఓ రిక్షా కార్మికుడు ఇలా సామాన్యులు ఉన్నారని, కానీ వారిని ఖాకీలు అరెస్టు చేసి కేసులు పెట్టారని పిటిషనర్ అన్నారు. మొత్తం 25 మంది మీద వారు ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు చేశారన్నారు.
వీటిని కొట్టివేయాలని పోలీసులను ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. అయితే ఇందుకు కోర్టు తిరస్కరిస్తూ.. ఖాకీలను తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. పిటిషన్ లో ప్రజా సంక్షేమానికి పనికి వచ్చేది లేదని అభిప్రాయపడింది. అయినా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినదని..దీన్ని విమర్శించేవారిని ఎలా సమర్థించ గలుగుతామని కూడా బెంచ్ ప్రశ్నించింది.
మరిన్ని ఇక్కడ చూడండి : Anushka Shetty Video:స్వీటీ మూవీ పై గుసగుసలు.. అనుష్క సినిమా ఆగిపోయిందా..(వీడియో).
హైదరాబాద్ లో ఆశర్యం..!బాబోయ్…సమాధి కింద శవం..! పదేళ్లయినా చెక్కుచెదరని శరీరం..:Hyderabad.
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.