సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌కు అస్వస్థత..
బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సరోజ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ శ్వాస సబంధిత సమస్యలు తలెత్తడంతో...

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సరోజ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ శ్వాస సబంధిత సమస్యలు తలెత్తడంతో కరోనా వైరస్ సోకిందేమోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నసరోజ్ ఖాన్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమెను ముంబై బాంద్రాలోని గురునానక్ ఆస్పత్రికి తరలించారు. నిబంధనల మేరకు ఆమెకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్స్ లో నెగిటివ్‌గా రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్వాస సంబంధిత సమస్యలకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆమెను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
భారతీయ సినిమా పరిశ్రమకు సరోజ్ ఖాన్ విశేషమైన సేవలందించారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఆమె 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి. తేజాబ్ చిత్రంలోని ‘ఏక్ దో తీన్‘, దేవదాస్ చిత్రంలో ‘దోలా రే దోలా..’ లాంటి పాటలు ఆమె కెరీర్‌లో మరుపురాని పాటలుగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.



