చైనా మా భూభాగాలను ఆక్రమిస్తోంది… నేపాల్ గగ్గోలు

భారతభూభాగాలపై కన్నేసి, కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా ఇప్పుడు నేపాల్ ప్రాంతాలమీదా 'దృష్టి' సారించింది. నేపాల్ భూభాగంలోని 11 ప్రాంతాలకు గాను 10 ప్రాంతాలను చైనా ఆక్రమించుకుందని ఆ దేశం ఆరోపించింది. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన..

చైనా మా భూభాగాలను ఆక్రమిస్తోంది... నేపాల్ గగ్గోలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 11:32 AM

భారతభూభాగాలపై కన్నేసి, కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా ఇప్పుడు నేపాల్ ప్రాంతాలమీదా ‘దృష్టి’ సారించింది. నేపాల్ భూభాగంలోని 11 ప్రాంతాలకు గాను 10 ప్రాంతాలను చైనా ఆక్రమించుకుందని ఆ దేశం ఆరోపించింది. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వే డిపార్ట్ మెంట్ రూపొందించిన ఓ నివేదిక ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఏయే ప్రాంతాల్లో చైనా తిష్ట వేసిందో వివరించింది. ఈ పది ప్రాంతాల్లో.. రానున్న రోజుల్లో చైనా బోర్డర్ పోస్టులను ఏర్పాటు చేయవచ్చునని నేపాల్ భయపడుతోంది. టిబెట్ అటానమస్ రీజియన్ పేరిట తన రోడ్ నెట్ వర్క్ ని డ్రాగన్ కంట్రీ విస్తరిస్తోంది.. కొన్ని నదులు, వాటి ఉపనదుల నీరు మా దేశ భూభాగాల దిశగా పారుతుండడంతో..అవి (భూభాగాలు) క్రమేపీ నశిస్తున్నాయి..దీంతో క్రమంగా చైనాకు చెందిన ‘టార్’ వైపు అవి మారిపోవచ్చు.. ఫలితంగా ఆ ప్రాంతాలను కూడా చైనా తమవిగా చెప్పుకోవచ్చు.. అని ఈ నివేదిక పేర్కొంది. బాగ్డేర్ ఖోలా, కర్నాలీ నదుల నీటిని మళ్లించి హుమ్లా జిల్లాలో పది హెక్టార్ల భూమిని చైనీయులు ఆక్రమించుకున్నారని, రసూలా జిల్లాలో ఆరు ఎకరాల నేపాలీ భూమిని కూడా ఆక్రమించి రోడ్డు నిర్మిస్తోందని నేపాల్ ఆరోపించింది. టిబెట్ లో ఆ దేశం చేపడుతున్న రోడ్డు నిర్మాణాల వల్ల మరి కొన్ని నదుల నీరు మళ్లిపోతోందని, తక్షణమే ప్రభుత్వం  సరైన చర్యలు తీసుకోకపోతే.. మరిన్ని భూభాగాలను చైనా ఆక్రమించుకోవడం తథ్యమని నేపాలీయులు గగ్గోలు పెడుతున్నారు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ