Anurag Thakur: బాక్సర్ రోహిత్‌ను కలిసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. క్రీడారంగానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న..
'సంపర్క్ సే సమర్థన్' పేరుతో బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సమాజంలో ఉన్న ప్రముఖులను బీజేపీ నేతలు కలుస్తున్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రముఖ బాక్సర్ రోహిత్ టోకాస్‌ను...
‘సంపర్క్ సే సమర్థన్’ పేరుతో బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సమాజంలో ఉన్న ప్రముఖులను బీజేపీ నేతలు కలుస్తున్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రముఖ బాక్సర్ రోహిత్ టోకాస్‌ను కలుసుకున్నారు. న్యూఢిల్లీకి సమీపంలో ఉన్న మునిర్కా అనే గ్రామంలో రోహిత్ ఇంటికి వెళ్లిన మంత్రి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి క్రీడా రంగానికి మోదీ చేస్తున్న కృషిని వివరించారు. అలాగే బీజేపీ పాలలోన క్రీడల్లో దేశం సాధించిన ఘనతలను తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..’రోహిత్ టోకాస్ బాక్సింగ్‌లో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని పెంచడమే కాకుండా రైల్వేలో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. అంతటితో ఆగకుండా భవిష్యత్తు క్రీడాకారులను సైతం తీర్చిదిద్దుతున్నారు. రోహిత్ నుంచి మనమంతా చాలా నేర్చుకోవాల్సి ఉంది. మొదట స్వి్మ్మింగ్, ఆ తర్వాత బాక్సర్ రాణించి దేశానికి మెడల్‌ను తీసుకొచ్చారు’ అని చెప్పుకొచ్చారు.
ఇక క్రీడా రంగానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషి గురించి వివరించిన మంత్రి..’దేశంలో క్రీడారంగానికి, క్రీడాకారుల అభ్యున్నతికి ఎంతో కృష్టి చేస్తున్నారు. దేశాన్ని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా తీర్చిదిద్దారు. దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు మోదీ నిరంతరంగా శ్రమిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ నేతృత్వంలోని బీజేపీ గెలవడం ఖాయం, దేశం మరింత ముందుకు వెళ్లడం ఖాయం. భారత దేశం సూపర్ పవర్‌గా ఎదగాలంటే ప్రజల ఆశీస్సులతో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి’ అని పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..