Vijay Deverakonda: బెట్టింగ్ యాప్స్ కేసుపై స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్.. క్లారిటీ ఏమని ఇచ్చిందంటే..
బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెలబ్రెటీలలో కంగారు మొదలైంది. గత కొన్ని రోజులుగా పోలీసులు నోటీసులు ఇస్తుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసుపై హీరో విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్స్, సినీతారలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో సెలబ్రెటీలలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియను దాదాపు మూడు గంటలు ప్రశ్నించారు పోలీసులు. అలాగే ఆమె ఫోన్ సైతం సీజ్ చేసినట్లుగా సమాచారం. మరోవైపు ఈడీ ఎంట్రీతో అరెస్ట్ తప్పదా అన్న ఆందోళన పలువురిని వెంటాడుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు వరుసగా సారీ అంటూ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు పలువురు యూట్యూబర్స్. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్ తోపాటు మరికొందరు స్టార్ సెలబ్రేటీలు పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదైంది. తాజాగా ఈ విషయంపై విజయ్ టీమ్ స్పందించింది.
బెట్టింగ్ యాప్స్ కు విజయ్ దేవరకొండ ప్రచారం చేయలేదని.. స్కిల్ బేస్ట్ గేమ్స్ కు మాత్రమే ప్రమోషన్స్ చేశారని క్లారిటీ ఇచ్చిదంి. విజయ్ ప్రచారం చేసిన కంపెనీలు అన్ని చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని.. ఆన్ లైన్ స్కిల్ బేస్ట్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పీఆర్ టీమ్ వెల్లడించింది. మరోవైపు విజయ్ దేవరకొండ ఏ ప్రకటన చేసినా.. ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా.. ఆ కంపెనీకి సంబంధించిన లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ చూసుకుంటుంది. ఆ కంపెనీ లేదా ప్రొడక్ట్ చట్ట ప్రకారం అనుమతి ఉంటేనే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారని తెలియజేసింది.
విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్ట్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీంకోర్టు తెలియజేసింది. ఏ23 అనే కంపెనీతో విజయ్ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థకు విజయ్ కు ఎలాంటి సంబంధం లేదని.. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. మరోవైపు ఏ23 యాప్ ను బాలీవుడ్ స్టార్ షారుఖ్ కాన్, లేడీ క్రికెటర్ స్మృతి మందాన, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్స్ ప్రమోట్ చేశారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..