AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: జపాన్ అమ్మాయిల్లో తారక్ క్రేజ్.. ఏకంగా ఎన్టీఆర్ కటౌట్ పెట్టి పూజలు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

NTR: జపాన్ అమ్మాయిల్లో తారక్ క్రేజ్.. ఏకంగా ఎన్టీఆర్ కటౌట్ పెట్టి పూజలు
Ntr
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2025 | 11:26 AM

Share

మ్యాన్ మాస్ నటించిన దేవర సినిమా 2024 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ డ్రామా చిత్రంగా  తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. జూనియర్ ఎన్టీఆర్ (NTR) ద్విపాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే  బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఇది జాన్వీ కపూర్‌కి తొలి తెలుగు సినిమా. “దేవర: పార్ట్ 1″ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ.550 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 6 కేంద్రాల్లో 100 రోజులు, మరో 2 కేంద్రాల్లో కంటిన్యూ ఆటతో 100 రోజులు పూర్తి చేసుకుంది దేవర సినిమా.

అలాగే దేవర నవంబర్ 8, 2024 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నాన్-ఇంగ్లీష్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలతో నాలుగో స్థానంలో నిలిచింది దేవర సినిమా.”దేవర” జపాన్‌లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి 19, 2025న జపాన్‌లో ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్  జరిగింది. అక్కడ కూడా దేవర సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సహం రెట్టింపైంది. ఇక ఎన్టీఆర్ కు జపాన్ లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అవ్వనుండటంతో జపాన్ అభిమానులు సందడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా జపాన్ ఫ్యాన్స్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి పూజ చేసేస్తున్నారు కొంతమంది జపాన్ అమ్మాయిలు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే “దేవర: పార్ట్ 2” గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడానటిస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!