AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నితిన్‌కు జోడీ కుదిరింది.. సాయి పల్లవి అవుట్.. ఎంట్రీ ఇచ్చిన మరో స్టార్ బ్యూటీ

ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత రాబిన్ హుడ్ సినిమాలో మరోసారి జత కట్టారు టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నితిన్- శ్రీలీల. భీష్మ సినిమాతో ఫేమస్ అయిన వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.

నితిన్‌కు జోడీ కుదిరింది.. సాయి పల్లవి అవుట్.. ఎంట్రీ ఇచ్చిన మరో స్టార్ బ్యూటీ
Nithin
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2025 | 11:25 AM

Share

కుర్ర హీరో నితిన్ కు అర్జెంట్ గా హిట్ కావాలి.. భీష్మ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా చేసినప్పటికీ ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇప్పుడు నితిన్ తనకు భీష్మ సినిమాలాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా రష్మిక మందన్నాను హీరోయిన్ అనుకున్నారు కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో శ్రీలీల ఎంటర్ అయ్యింది. ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నాడు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నితిన్ కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారట వక్కంతం వంశీ.

ఇది కూడా చదవండి : 55 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే.. స్టార్ హీరోల్లోనూ యమా క్రేజ్.. ఆమె ఎవరంటే

వీటితో పాటు బలగం సినిమా దర్శకుడు వేణు తో సినిమా చేస్తున్నాడు. కమెడియన్‌ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. తెలంగాణ పల్లెల్లోని కుటుంబాల మధ్య జరిగే గొడవలను ఒక చావు చుట్టూ అల్లిన విధానం ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఇప్పుడు ఎల్లమ్మ అనే సినిమాతో రానున్నాడు వేణు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో ఉండనుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ముందుగా శ్రీలీలజను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఆల్మోస్ట్ సాయి పల్లవి కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆమె వరుస సినిమాలను కమిట్ అవ్వడం తో ఆమె ప్లేస్ లో ఇప్పుడు మరో హీరోయిన్ ను అనుకుంటున్నారట. అయితే రీసెంట్ గా కీర్తిసురేష్ కు కథ వినిపించాడట దర్శకుడు వేణు. అయితే కీర్తిసురేష్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు. గతంలో నితిన్, కీర్తిసురేష్ కలిసి నటించిన రంగ్ దే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!
అయ్యో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల.. చివరకు..
అయ్యో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల.. చివరకు..
పొద్దు పొద్దున్నే గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత.. చివరకు
పొద్దు పొద్దున్నే గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత.. చివరకు
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్..
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్..
ఏపీలో సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్ లైన్ లోనే
ఏపీలో సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్ లైన్ లోనే