పర్మిషన్ లేకుండా అతను నా రూమ్‌లోకి వచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీ ఎదురుకొంటున్న అతిపెద్ద సమస్య కాస్టింగ్ కౌచ్. మహిళల పై జరుగుతోన్న లైంగిక వేధింపుల పై ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. ఓ వైపు మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ రచ్చ లేపుతోంది. చాలా మంది తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అంటూ దైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఎదో వార్త వినిపిస్తూనే ఉంది. చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికే దీని పై నోరు విప్పారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు కొందరు హీరోయిన్స్. స్టార్ హీరోయిన్స్ కూడా తమకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను బయట పెట్టారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా షాకింగ్ విషయం చెప్పింది. పర్మిషన్ లేకుండా ఓ దర్శకుడు తన రూమ్ లోకి వచ్చాడని తెలిపింది. ఇంతకూ ఆ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా.? చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన కేజ్ సొంతం చేసుకుంది.ఆమె ఎవరంటే..
2017లో విజయ్ దేవరకొండ నటించిన తెలుగు చిత్రం “అర్జున్ రెడ్డి”తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది షాలిని పాండే . ఈ సినిమాలో ఆమె “ప్రీతి” పాత్రలో నటించి, తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో షాలినికి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. అయితే తెలుగు రాకపోయినా, ఆమె ఈ సినిమాకి తానే డబ్బింగ్ చెప్పుకుంది, ఇది ఆమె పట్టుదలను చాటుతుంది.
“అర్జున్ రెడ్డి” తర్వాత షాలిని తెలుగులో “మహానటి”, కళ్యాణ్ రామ్ “118”, “ఇద్దరి లోకం ఒకటే”, “నిశ్శబ్దం”వంటి చిత్రాల్లో నటించింది. “మహానటి”లో సావిత్రి స్నేహితురాలి పాత్రలో ఆమె చేసిన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే, తమిళంలో “100% కాదల్” చిత్రంలో కూడా నటించింది. హిందీలో “జయేష్‌భాయ్ జోర్దార్” మరియు “మహారాజ్” చిత్రాలతో బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది. తాజాగా “డబ్బా కార్టెల్” అనే వెబ్ సిరీస్‌లో బలమైన మహిళా పాత్రలో కనిపించి మంచి ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా షాలిని పాండే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో ఓ సౌత్ సినిమా చేస్తున్న సమయంలో నేను కార్వాన్ లో బట్టలు మార్చుకుంటుంటే ఓ దర్శకుడు సడన్ గా వచ్చి డోర్ తీశాడు. దాంతో నాకు కోపం వచ్చి గట్టిగా అరిచి కేకలు వేశాను. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్లు దర్శకుడి మీద అలా అరవకూడదు అని అన్నారు. కానీ నేను చేసింది నాకు తప్పు అనిపించలేదు. ఆతర్వాత నేను అలాంటి సమస్యను ఎదురుకోలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.