ఆర్థిక పరిపుష్టిలో భారత్ మరో ముందడుగు.. 55 కోట్లకు చేరిన జన్-ధన్ ఖాతాలు
నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మొదటి పదవీకాలంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ను ప్రారంభించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాను తెరవడానికి, భారత పౌరుడు అయి ఉండాలి. అలాగే 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడైనా ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన లబ్ధిదారుడు కావచ్చు. అయితే, 18 ఏళ్ల వయసు వచ్చేలోపు సంరక్షకుడి మద్దతు అవసరం.

భారతదేశం ఆర్థిక స్వాలంభనలో గణనీయమైన మైలురాళ్లను చేరుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మొదటి పదవీకాలంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ను ప్రారంభించింది. ఈ పథకం కింద, మార్చి 7, 2025 వరకు 55.05 కోట్ల మంది కస్టమర్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిలో 36.63 కోట్లు మంది అంటే 66.57 శాతం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో తెరవడం జరిగింది. ఈ విషయాన్ని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ సమాచారాన్ని అందించారు.
దేశ పగ్గాలు చేపట్టిన తర్వాత, తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 15న చారిత్రాత్మక ఎర్రకోట నుండి ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం దేశవ్యాప్తంగా 28 ఆగస్టు 2014న ప్రారంభించారు. దేశంలో బ్యాంకులు అందుబాటులో లేని అణగారిన వర్గాలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చడమే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన లక్ష్యం. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ (DBT)లో సహాయకారిగా మారాయి.
జన్ ధన్ ఖాతా గురించి..
బ్యాంకింగ్ సేవలు లేని వారికి బ్యాంకింగ్ సేవలు అందించడం, భద్రత లేని వారికి భద్రత కల్పించడం మరియు పేద ప్రాంతాలకు సేవలందించడం” అనే సూత్రాలను అనుసరించి, బ్యాంకు సేవలు లేని పెద్దలందరికీ సార్వత్రిక బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడం PMJDY లక్ష్యం. దీనికి అదనంగా, అనేక ఇతర ఆర్థిక చేరిక కార్యక్రమాలు, ముఖ్యంగా అణగారిన జనాభాకు సరసమైన ఆర్థిక సేవలను అందించడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి.
జన్ ధన్ ఖాతాలో రూ. 2 లక్షల ప్రమాద బీమా కవర్ ఉంటుంది. ఈ ఖాతాను తెరవడానికి ఎటువంటి రుసుము లేదా నిర్వహణ ఛార్జీ లేదు. ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ఖాతాదారులకు రూ. 10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత, మీరు ఈ ఖాతా ద్వారా రూ. 10,000 వరకు రుణం తీసుకోవచ్చు.
సెప్టెంబర్ 2023లో ప్రారంభించిన PM విశ్వకర్మ పథకం, నైపుణ్య అభివృద్ధి, క్రెడిట్ యాక్సెస్, మార్కెట్ లింకేజీలను అందించడం ద్వారా సాంప్రదాయ కళాకారులు, చేతివృత్తుల వారికి మద్దతు ఇస్తుంది. జూన్ 2020లో ప్రవేశపెట్టబడిన ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మ నిర్భర్ నిధి (PMSVANidhi), COVID-19 లాక్‌డౌన్ ద్వారా ప్రభావితమైన వీధి విక్రేతలకు ఆర్థిక సహాయం అందిస్తుంది, వారి ఆర్థిక పునరుద్ధరణకు దోహదం చేస్తుంది.
జన్ ధన్ ఖాతాను ఎవరు తెరవగలరు?
ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాను తెరవడానికి, భారత పౌరుడు అయి ఉండాలి. అలాగే 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడైనా ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన లబ్ధిదారుడు కావచ్చు. అయితే, 18 ఏళ్ల వయసు వచ్చేలోపు సంరక్షకుడి మద్దతు అవసరం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..