కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు గుడ్‌న్యూస్..
ఆధునిక సమాజంలోనూ కులాంతర, మతాంతర వివాహాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో ఇలాంటి వివాహాలు పరువు హత్యలకు దారితీస్తున్నాయి. ఇటువంటి క్రమంలో కేరళ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం ప్రకటించింది.

ఆధునిక సమాజంలోనూ కులాంతర, మతాంతర వివాహాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో ఇలాంటి వివాహాలు పరువు హత్యలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజా సంఘాలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల్లో మార్పు రావటం లేదు..అదే మూస ధోరణితో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి క్రమంలో కేరళ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం ప్రకటించింది. కులాంతర, మతాంతర వివాహలు చేసుకునే జంటలకు అభయహస్తాన్ని అందిస్తోంది.
ప్రేమపెళ్లిళ్లు అంటేనే భగ్గున మండిపోయే కేరళ రాష్ట్రంలో ప్రేమికులకు భరోసా కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు ప్రాణహాని లేకుండా రక్షిత గృహాలను నిర్మిస్తోంది. సేఫ్ హోమ్స్ పేరుతో వీటిని నిర్మిస్తున్నట్లు ఆరోగ్య, సామాజిక న్యాయ శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. కొట్టాయంలో ఇటీవల అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త జంటలు పెళ్లయిన తర్వాత ఒక ఏడాదిపాటు ఈ ఇళ్లలో భద్రంగా ఉండొచ్చని మంత్రి తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం వారికి రూ. 35 వేల ఆర్థిక సాయం కూడా ఇస్తుందన్నారు. ‘ఎన్జీఓల సాయంతో వీటిని నిర్మిస్తున్నటు వివరించారు. ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహించడం మా విధి. దంపతుల్లో ఎస్సీ, ఎస్సీలు ఉంటే వారికి అదనంగా రూ. 75 వేల సాయం కూడా అందుతుంది’ అని ఆమె చెప్పారు.




