Be Alert : వర్షం పడితే కరోనా వైరస్ మరింత తీవ్రమట..! ఎలాగంటే..?
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి తెలిసిందే.చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. దాదాపు మూడువేల మందికి పైగా పొట్టనబెట్టుకుంది. లక్ష మంది వరకు ఈ వైరస్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వైరస్ గాలిలో వ్యాపించకున్నా.. ఈ వైరస్ బారిన పడ్డ వారిని టచ్ చేస్తే సోకుతుంది. ఈ వైరస్ ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనదేశంలోని వాతావరణంలో ఇది తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ విదేశాలనుంచి వచ్చిన […]

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి తెలిసిందే.చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. దాదాపు మూడువేల మందికి పైగా పొట్టనబెట్టుకుంది. లక్ష మంది వరకు ఈ వైరస్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఈ వైరస్ గాలిలో వ్యాపించకున్నా.. ఈ వైరస్ బారిన పడ్డ వారిని టచ్ చేస్తే సోకుతుంది. ఈ వైరస్ ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనదేశంలోని వాతావరణంలో ఇది తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ విదేశాలనుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా ఈ వైరస్ మనదేశంలోకి ఎంటర్ అయ్యింది. అయితే ఇది చలి ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కువ యాక్టివ్‌గా పనిచేస్తుందట. అయితే వేడి ప్రదేశాల్లో అంత యాక్టివ్‌గా ఉండలేదట.
వర్షాలు పడితే మాత్రం.. ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తాయి. దీంతో ఈ వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు విపరీతంగా భయబ్రాంతులకు గురవుతున్నారు. జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, లడాక్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో సడన్‌గా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల స్వల్పంగా వర్షాలు పడుతున్నాయి. తాజగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సడన్‌గా పలు చోట్ల స్వల్ప వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అస్వస్తతకు గురైతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిందేనంటున్నారు అధికారులు.



