ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..!

August 19

Jyothi Gadda

కీళ్ల నొప్పుల నివారణ: జిల్లేడు ఆకులను వేడి చేసి బాధిస్తున్న కీళ్లపై కట్టడం లేదా ఆకుల రసాన్ని క్రమంగా రాయడం వల్ల వాపులు, తీవ్రమైన కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు: జిల్లేడు పువ్వులు లేదా ఆకుల డికాక్షన్ శ్వాసనాళాల్లోని కఫాన్ని పల్చగా చేసి బయటకు పంపడం ద్వారా ఆస్తమా, దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది.

తలనొప్పికి చక్కటి పరిష్కారం: జిల్లేడు ఆకులను మెత్తగా నూరి నుదిటిపై పేస్ట్‌లా రాయడం వల్ల అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తీవ్రమైన తలనొప్పిని త్వరగా తగ్గిస్తాయి.

చర్మ ఇన్ఫెక్షన్ల నివారణ: ఆకుల పేస్ట్ లేదా రసాన్ని చర్మంపై పూయడం వల్ల తామర, దురదలు, మొటిమలు, ఇతర ఇన్ఫెక్షన్లు పెరగకుండా అరికట్టవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.

పైల్స్ సమస్యకు ఉపశమనం: పైల్స్ గాయాలు, నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకుల పేస్ట్‌ను గాయంపై తరచూ అప్లై చేయడం వల్ల మంట తగ్గి గాయాలు త్వరగా నయమవుతాయి.

జీర్ణ వ్యవస్థ మెరుగుదల: జిల్లేడు భాగాలను సంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో సరైన మోతాదులో వాడటం వల్ల మలబద్ధకం, విరేచనాలు, కడుపు పూతల వంటి సమస్యలు తగ్గుతాయి.

గాయాలను త్వరగా మానపడం: ఈ మొక్కలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు శరీరంపైన ఏర్పడే దెబ్బలు, గాయాలను త్వరగా మాన్పడానికి ఎంతో బాగా తోడ్పడతాయి.

దంత సమస్యల నివారణ: జిల్లేడు వేరు లేదా పాలు ఆయుర్వేదంలో దంత క్షయం, పంటి నొప్పి, చిగుళ్ల వాపుల నివారణలో ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఎంతగానో తోడ్పడతాయి.

రక్తంలో చక్కెర నియంత్రణ: జిల్లేడు ఆకుల్లోని ప్రత్యేక గుణాలు శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరిచి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.