AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine war: ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన భారతీయ విద్యార్థి.. కోయంబత్తూర్‌లో ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలు..

ఉక్రెయిన్‌పై రష్యా(Russia Ukraine war) దండెత్తుతోంది.. ఉక్రెయిన్ నగరాలను ఒక్కొక్కటి స్వాధీనం చేసుకుంటోంది. రష్యా చర్చలు జరుపుతూనే యుద్ధం కొనసాగిస్తోంది...

Russia-Ukraine war: ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన భారతీయ విద్యార్థి.. కోయంబత్తూర్‌లో ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలు..
Indian Student
Srinivas Chekkilla
|

Updated on: Mar 08, 2022 | 6:13 PM

Share

ఉక్రెయిన్‌పై రష్యా(Russia Ukraine war) దండెత్తుతోంది.. ఉక్రెయిన్ నగరాలను ఒక్కొక్కటి స్వాధీనం చేసుకుంటోంది. రష్యా చర్చలు జరుపుతూనే యుద్ధం కొనసాగిస్తోంది. ఈ యుద్ధం ప్రతిధ్వని భారత్‌లో వినిపిస్తుంది. ఈ యుద్ధంతో భారత్ ఆర్థిక(Indian Economy) సమస్యలను ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తీసుకురావడం మరో సవాల్‌గా మారింది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులను తరలించింది.. ఇంకా చాలా మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లోనే ఉండిపోయారు. అయితే ఉక్రెయిన్ వాసుల బాధను చూసిన ఓ ఇండియన్ విద్యార్థి(Indian Student) చలించిపోయాడు. తనకు ఆశ్రయం కల్పించిన ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని నిర్చయించుకున్నాడు. ఏకంగా ఉక్రెయిన్‌ ఆర్మీలో చేరాడు. రష్యాతో పోరాటానికి సిద్ధమయ్యాడు.

తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల సైనికేశ్ రవిచంద్రన్ ఉక్రెయిన్​ ఆర్మీలో చేరాడు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆ యువకుడు రెండు సార్లు ప్రయత్నించగా.. విఫలమయ్యాడు. అతను జార్జియన్ నేషనల్ లెజియన్ పారామిలిటరీ యూనిట్‌లో భాగంగా.. ఉక్రెయిన్ ఆర్మీలో వాలంటీర్‌గా చేరాడని పేర్కొంది తమిళనాడు ప్రభుత్వం. సైనికేశ్​ 2018లో ఖార్కీవ్‌లోని ఇంజనీరింగ్​ నేషనల్​ఎరోస్పేస్‌లో ఎరోస్పేస్​ ఇంజనీరింగ్​ చదివేందుకు అక్కడికి వెళ్లాడు. ఈ ఏడాది జులైతో అతని కోర్స్​ ముగియనుంది.ఇండియాలో ఇంటర్​మీడియట్​(12వ తరగతి) ముగిసిన తర్వాత ఇండియన్​ ఆర్మీలో చేరేందుకు ప్రయత్నించినా సెలెక్ట్​ కాలేదు. అయినా తనకు ఆర్మీలో చేరాలనే కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలని.. చెన్నైలోని అమెరికా కాన్సూలేట్ ద్వారా అమెరికా ఆర్మీలో చేరేందుదుకు కూడా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీనితో సైనికేశ్​ఎరోస్పేస్​ ఇంజినీరింగ్ అభ్యసించాలని నిర్ణయించుకున్నాడని తెలిసింది. గత ఏడాది జులైలో ఇండియాకు వచ్చిన సైనికేశ్​ నెలన్నర పాటు ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి ఉక్రెయిన్​ వెళ్లిపోయాడు.

ఇటీవల రష్యా-ఉక్రెయిన్​ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సైనికేశ్‌ కుటుంబంతో కాంటాక్ట్​ కాలేదని తెలిసింది. దీనితో సైనికేశ్‌కు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు. ఎంబసీ సైనికేశ్ గురించి ఆరా తీయగా.. అతడు ఉక్రెయిన్ ఆర్మీలో చేరినట్లు చెప్పారు. దీంతో అతను స్వస్థలమైన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇండియన్ ఆర్మీ లో చేరాలన్నది రవిచంద్రన్ చిన్ననాటి కోరికని.. అదిక్కడ నెరవేరక పోవడంతో అక్కడ ఆర్మీలో చేరి ఉంటాడని అతని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

Read Also.. Russia Ukraine Crisis: ఎక్కడికి పారిపోలేదు.. కావాలంటే వీడియో చూసుకోండి.. రష్యాకు సవాల్ విసిరిన జెలెన్‌స్కీ