Maha Politics: ‘మహా’ కూటమికి సావర్కర్ గండం.. రాహుల్ వ్యాఖ్యలపై ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం..

|

Mar 28, 2023 | 8:53 AM

రాహుల్‌గాంధీ అనర్హత ఎపిసోడ్‌... దేశంలోనే కాదు.. మహారాష్ట్రలో కూడా పెను రాజకీయ దుమారానికి దారితీస్తోంది. నేషనల్ పాలిటిక్స్‌లో శత్రువుల్ని సైతం మిత్రులుగా మార్చుకుంటున్న రాహుల్.. మరాఠీ గడ్డపై మాత్రం మిత్రుడ్ని శత్రువుగా మార్చుకుంటున్నారు. మహామహా కూటములే కూలిపోయే ప్రమాదంలో పడ్డాయ్. టోటల్‌గా మరాఠీ పాలిటిక్స్‌ని బాగానే డిస్టర్బ్ చేశారు రాహుల్ గాంధీ.

Maha Politics: మహా కూటమికి సావర్కర్ గండం.. రాహుల్ వ్యాఖ్యలపై ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం..
Maharashtra Politics
Follow us on

రాహుల్‌గాంధీ అనర్హత ఎపిసోడ్‌… దేశంలోనే కాదు.. మహారాష్ట్రలో కూడా పెను రాజకీయ దుమారానికి దారితీస్తోంది. నేషనల్ పాలిటిక్స్‌లో శత్రువుల్ని సైతం మిత్రులుగా మార్చుకుంటున్న రాహుల్.. మరాఠీ గడ్డపై మాత్రం మిత్రుడ్ని శత్రువుగా మార్చుకుంటున్నారు. మహామహా కూటములే కూలిపోయే ప్రమాదంలో పడ్డాయ్. టోటల్‌గా మరాఠీ పాలిటిక్స్‌ని బాగానే డిస్టర్బ్ చేశారు రాహుల్ గాంధీ.

ఒకేఒక్క మాట.. మహారాష్ట్ర పొలిటికల్ ఈక్వేషన్లను గజిబిజిగా మార్చేసింది. వీర్‌ సావర్కర్‌ పిరికివాడంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్య మరాఠీ పాలిటిక్స్‌ మీద పెను ప్రభావమే చూపుతోంది. సావర్కర్‌లా నేను ఎవరికీ లొంగిపోను, సారీ చెప్పను.. అంటూ మోదీనుద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు సగటు మరాఠీని సూటిగా తాకేశాయి. సావర్కర్ సెంటిమెంట్‌ని పొలిటికల్‌గా సొమ్ము చేసుకునే క్రమంలో ముందుకొచ్చింది శివసేన ఉథ్థవ్‌థాక్రే వర్గం.

వీర్‌సావర్కర్‌ని అవమానించడం ద్వారా సత్యాగ్రహ ఉద్యమాన్ని గెలిపించాలనుకోవడం రాహుల్‌ అమాయకత్వమని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఉథ్థవ్‌ థాక్రే. శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన ఎడిటోరియల్‌ కూడా రాహుల్‌ని తప్పుబట్టింది. తాజా పరిణామాలతో శివసేనకూ కాంగ్రెస్‌కీ మధ్య దూరం పెరిగింది. మొన్నటివరకూ కాంగ్రెస్‌-ఎన్‌సీపీ-శివసేన కలిసి మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో మహా కూటమి అధికారంలో ఉండేది. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ సపోర్ట్‌తో కొత్త సర్కార్ ఏర్పాటైంది.

ఇవి కూడా చదవండి

డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన సీఎం షిండే.. తాము కూడా మహారాష్ట్ర వ్యాప్తంగా సావర్కర్ గౌరవ్ యాత్ర చేపడతామన్నారు. సావర్కర్‌ని అవమానించిన రాహుల్‌గాంధీని నిలదీయాలంటూ ఉథ్థవ్‌ని డిమాండ్ చేశారు. 2004లో మణిశంకర్ అయ్యర్ కూడా ఇలాగే సావర్కర్‌పై నోరు పారేసుకున్నారని, అప్పట్లో బాల్‌థాకరే పిలుపు మేరకు తామంతా.. కాంగ్రెస్ వాళ్లను చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పామని గుర్తు చేశారు. మీరు మాత్రం కాంగ్రెస్‌తో కలిసిపోయి మరాఠీయిజాన్ని అవమానిస్తారా.. లేక ధైర్యంగా బైటికొచ్చేస్తారా అని ఛాలెంజ్ విసిరారు ఏక్‌నాథ్ షిండే.

అటు.. రాహుల్‌ అనర్హత నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత వర్థిల్లాలి అంటూ దేశవ్యాప్తంగా రాజకీయ నినాదం ఊపందుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌ కూడా కాంగ్రెస్‌కి బాసటగా నిలిచి, బీజేపీ-వ్యతిరేక కూటమిలో చేరిపోయింది. కానీ.. శివసేన ఉథ్థవ్ వర్గం మాత్రం అపోజిషన్ కూటమికి దూరంగా ఉండిపోయింది. కాంగ్రెస్ పిలుపునిస్తున్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో 45 సీట్లున్న కాంగ్రెస్‌ పార్టీ బలం.. ఉథ్థవ్‌కి చాలా కీలకం. కాంగ్రెస్‌కి ఉథ్థవ్ కటీఫ్ చెబితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మహాకూటమి మనుగడ సాధ్యం కాకపోవచ్చు. వీర్‌ సావర్కర్‌పై రాహుల్‌గాంధీ చేసిన కామెంట్.. చివరికిలా.. మహారాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాల్లో పెనుమార్పులకు దారితియ్యబోతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..