ఈ గణేష్ దర్శనం రెండు రోజులు మాత్రమే..!
గుజరాత్‌లో ఓ గణేష్ భక్తుడు ఏర్పాటు చేసిన డైమండ్ గణేష్ విగ్రహం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సూరత్ నగరంలోని కతర్గం ప్రాంతానికి చెందిన రాజేష్ పాండవ్.. ప్రతీ ఏటా తన ఇంట్లో ఈ డైమాండ్ విగ్రహాన్నిపెట్టి గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ వజ్రాన్ని ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ ధృవీకరించింది. దీని బరువు 27.7 కిలోలు ఉన్నట్లు తెలిపింది. ఈ డైమండ్ గణేష్ విలువ సుమారు 500 కోట్లు వరకు ఉంటుందని డైమండ్ ఇనిస్టిస్టూట్ పేర్కొనింది. […]

గుజరాత్‌లో ఓ గణేష్ భక్తుడు ఏర్పాటు చేసిన డైమండ్ గణేష్ విగ్రహం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సూరత్ నగరంలోని కతర్గం ప్రాంతానికి చెందిన రాజేష్ పాండవ్.. ప్రతీ ఏటా తన ఇంట్లో ఈ డైమాండ్ విగ్రహాన్నిపెట్టి గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ వజ్రాన్ని ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ ధృవీకరించింది. దీని బరువు 27.7 కిలోలు ఉన్నట్లు తెలిపింది. ఈ డైమండ్ గణేష్ విలువ సుమారు 500 కోట్లు వరకు ఉంటుందని డైమండ్ ఇనిస్టిస్టూట్ పేర్కొనింది.
2005లో కాంగోలోని ఎంబూజీ గని నుండి వేలంలో భాగంగా ఈ విగ్రహాన్ని 29 వేలకు కొనుగోలు చేశాడు రాజేష్ పాండవ్. అప్పుడు వేలంలో కొనుకున్న ఈ వజ్రం.. గణేష్ అకారంలో ఉండడంతో అప్పటి నుంచి ప్రతీ ఏటా వినయక చవితి రోజు ఈ డైమండ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ డైమండ్ గణేషుడుని రాజేష్ పాండవ్ కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తాడు. ఈ విగ్రహాన్ని రెండ్రోజులు మాత్రమే తన ఇంట్లో ప్రదర్శిస్తారు. మూడో రోజు ఈ డైమండ్ విగ్రహంపై తాపి నది నీళ్లు చల్లి మళ్లీ సేఫ్ లాకర్‌లో ఉంచుతామని రాజేష్ తెలిపాడు.