ఫలించిన బెంగుళూరు ‘ ఏస్ట్రోనట్ ‘ ప్రొటెస్ట్.. గుంతలు మాయం

ఫలించిన బెంగుళూరు ' ఏస్ట్రోనట్ ' ప్రొటెస్ట్.. గుంతలు మాయం

బెంగుళూరులో ఓ వ్యక్తి రోడ్ల దుస్థితి వెలుగులోకి తీసుకురావడానికి ‘ వ్యోమగామి ‘ లా సూట్ ధరించి..చంద్రునిపై నడుస్తున్నట్టు వినూత్న నిరసన ప్రకటించిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. ఆ రోడ్డుపై మట్టి పోసి గుంతలు పూడ్చారు. ఇది తెలిసిన నంజుండ స్వామి అనే ఆ వ్యక్తి వారికి కృతజ్ఞతలు తెలిపాడు. వారిని అభినందించాడు. వారు చేపట్టిన పనుల తాలూకు వీడియోను కూడా ట్విట్టర్లో […]

Anil kumar poka

|

Sep 04, 2019 | 2:02 PM

బెంగుళూరులో ఓ వ్యక్తి రోడ్ల దుస్థితి వెలుగులోకి తీసుకురావడానికి ‘ వ్యోమగామి ‘ లా సూట్ ధరించి..చంద్రునిపై నడుస్తున్నట్టు వినూత్న నిరసన ప్రకటించిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. ఆ రోడ్డుపై మట్టి పోసి గుంతలు పూడ్చారు. ఇది తెలిసిన నంజుండ స్వామి అనే ఆ వ్యక్తి వారికి కృతజ్ఞతలు తెలిపాడు. వారిని అభినందించాడు. వారు చేపట్టిన పనుల తాలూకు వీడియోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మొత్తానికి బెంగుళూరులోని తుంగానగర్ రోడ్డుకు మహర్దశ పట్టింది. నగరంలో ఇంకా ఏయే రోడ్లలో ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో తెలుసుకుని మళ్ళీ ఈ అభినవ  ‘వ్యోమగామి ‘ ఇలాంటి వెరైటీ నిరసన చేపడతాడేమో చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu