డాక్టర్లపై దాడి చేస్తే ఖబడ్ధార్ ! తప్పదు భారీ మూల్యం !

డాక్టర్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పెరుగుతున్న హింస, విధ్వంసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సరికొత్త చట్టాన్నిసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై దాడిచేసిన వారు ఇకపై కఠిన దండన ఎదుర్కొవ్సాల్సి ఉంటుంది. వైద్యుల మీదో, వైద్యం మీదో కోపంతో విధ్వంసానికి తెగబడినా కఠిన శిక్ష తప్పదు. హింస, విధ్వంసాలను రెచ్చగొట్టినా జైలు తప్పదు. ఈ మేరకు చట్టాన్ని రూపొందించిన కేంద్రం..దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును […]

డాక్టర్లపై దాడి చేస్తే ఖబడ్ధార్ ! తప్పదు భారీ మూల్యం !
Follow us

|

Updated on: Sep 04, 2019 | 5:22 PM

డాక్టర్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పెరుగుతున్న హింస, విధ్వంసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సరికొత్త చట్టాన్నిసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై దాడిచేసిన వారు ఇకపై కఠిన దండన ఎదుర్కొవ్సాల్సి ఉంటుంది. వైద్యుల మీదో, వైద్యం మీదో కోపంతో విధ్వంసానికి తెగబడినా కఠిన శిక్ష తప్పదు. హింస, విధ్వంసాలను రెచ్చగొట్టినా జైలు తప్పదు.
ఈ మేరకు చట్టాన్ని రూపొందించిన కేంద్రం..దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఆన్‌లైన్‌లో పెట్టింది. ఈ బిల్లు ప్రకారం ఆస్పత్రి సిబ్బందిపై దాడిచేస్తే కనీసం ఆరు నెలలు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది.  గాయపరిచినా, హింసించినా దాని తీవ్రతను బట్టి రూ. 5 లక్షల వరకు జరిమానా కూడా ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేసు తీవ్రతను బట్టి రూ 10 లక్షల దాకా జరిమానా విధించవచ్చునేర శిక్షాస్మృతితో సంబంధం లేకుండా కేవలం ఓ చిన్న కాగితం మీద బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేస్తారు. సీఆర్‌పీసీతో సంబంధం లేకుండా వెంటనే అరెస్టు చేయవచ్చు,  చేసిన నేరానికి బెయిల్‌ కూడా ఇవ్వరు..డీఎస్పీ ర్యాంకు అధికారి కేసు నమోదు, దర్యాప్తు చేపట్టాలి. ఆస్తినష్టానికి తెగబడితే నష్ట పరిహారం భారీగా వసూలుతో పాటు మూడు నుంచి ఐదేళ్ల  పాటు జైలు తప్పదని వెల్లడించింది. ఈ ముసాయిదా బిల్లుపై నెల రోజుల లోపు ప్రజల సలహాలు, సూచనలు తరువాత మార్పు చేర్పులు చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం