Gujarat: కోస్ట్‌గార్డ్స్‌కు సముద్రంలో కనిపించిన డ్రమ్ములు.. వాటిని సేకరించి ఓపెన్ చేయగా..
చిమ్మ చీకట్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ డేరింగ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఏకంగా 1,800 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడింది. కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇదే మొదటిసారి. సొత్తు దొరికింది సరే.. మరి దొంగలెక్కడ? వాళ్ల ప్లానేంటి? స్కెచ్చేంటి?

ఏప్రిల్ 10న ఉదయం 10 గంటలకు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కి ఓ ఇన్ఫర్మేషన్ వచ్చింది. పాకిస్తాన్ నుంచి మత్తు పదార్థాలతో కూడిన ఫిషింగ్ బోట్ బయల్దేరింది. ఏప్రిల్ 12- 13న పోర్ బందర్ సమీపంలోని ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ దగ్గరకి ఫిషింగ్ బోట్ చేరుకుంటుందన్నది ATSకు అందిన సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా గుజరాత్ ఏటీఎస్ – ఇండియన్ కోస్ట్ గార్డ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. అనుమానాస్పద పడవను ట్రాక్ చేశాయి. వాళ్ల పడవను పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. ఇది ముందే గ్రహించిన స్మగ్లర్లు.. నీలిరంగు డ్రమ్ములను సముద్రంలోకి విసిరేశారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ దాటి తప్పించుకున్నారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి అత్యంత ప్రతికూల చీకటి వాతావరణంలో డ్రగ్స్‌తో కూడిన డ్రమ్స్‌ను బయటకు తీశాయి. సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను పొరు బందర్‌కు తరలించాయి. ఈ మధ్య కాలంలో ICG – ATS సంయుక్తంగా చేపట్టిన 13 ఆపరేషన్లు విజయవంతం చేశాయి. వేల కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశాయి.

Anti Narcotics Operation
గతేడాది నవంబర్‌లో ICG భారీ ఆపరేషన్ చేపట్టింది. అండమాన్ నికోబార్ తీరంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది భారీగా మాదక ద్రవ్యాలను పట్టుకుంది. ఓ ఫిషింగ్ బోట్ నుంచి ఆరు వంద కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే కోస్ట్ గార్డ్ చరిత్రలో 6,000 కిలోల మెథాంపేటమిన్‌ను సీజ్ చేయడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 1800 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు అధికారులు. అయితే ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ దాటి తప్పించుకున్న వాళ్లలో కేవలం పాకిస్తాన్‌కు చెందినవాళ్లే ఉన్నారా? ఇరానియన్, ఆప్ఘనిస్తాన్, నైజీరియన్లు కూడా ఉన్నారా అన్నది మాత్రం తెలియరాలేదు.
2018 నుంచి ఏటీఎస్ ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. వేల కిలోల డ్రగ్స్ సీజ్ చేస్తూనే.. 160మందికి పైగా నిందితుల్ని అరెస్ట్ చేసింది. ఫైనల్‌గా మరో భారీ ఆపరేషన్‌తో స్మగ్లర్లకు వణుకు పుట్టించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..