సుష్మాతో వాదించే అవకాశాన్ని కోల్పోయాను.. పాక్ మంత్రి నివాళి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మృతిపట్ల పాక్ మంత్రి సంతాపం తెలిపారు. ఆమె మరణంపై పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ  మంత్రి ఫవాద్ హుస్సేన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. సుష్మా లేకపోవడంతో వాగ్వివాదానికి దిగే అవకాశాన్ని కోల్పోతున్నానని గత అనుభవాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే గొప్ప వ్యక్తి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ ఫవాద్ ట్వీట్ […]

సుష్మాతో వాదించే అవకాశాన్ని కోల్పోయాను.. పాక్ మంత్రి నివాళి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 07, 2019 | 4:06 PM

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మృతిపట్ల పాక్ మంత్రి సంతాపం తెలిపారు. ఆమె మరణంపై పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ  మంత్రి ఫవాద్ హుస్సేన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. సుష్మా లేకపోవడంతో వాగ్వివాదానికి దిగే అవకాశాన్ని కోల్పోతున్నానని గత అనుభవాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే గొప్ప వ్యక్తి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ ఫవాద్ ట్వీట్ చేశారు. సుష్మా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.