రూ. 64 కోట్ల ఆస్తుల సీఎం నవీన్ పట్నాయక్.. 26 లక్షల పేద మంత్రి తుష్కర్
ఒరిస్సా మంత్రివర్గంలో సీఎం నవీన్ పట్నాయక్ రూ. 64.26 కోట్ల విలువైన ఆస్తులతో అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు. 2019 మార్చి 31 నాటికి తనకు 62 కోట్లకు పైగా విలువైన స్థిరాస్థులు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం.. మంత్రుల ఆస్తుల తాలూకు వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేసింది. కొన్నేళ్ల క్రితం తన సోదరి గీతా మెహతా నుంచి తీసుకున్న రూ. 15 లక్షల అప్పును తాను తిరిగి చెల్లించలేదని కూడా […]
ఒరిస్సా మంత్రివర్గంలో సీఎం నవీన్ పట్నాయక్ రూ. 64.26 కోట్ల విలువైన ఆస్తులతో అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు. 2019 మార్చి 31 నాటికి తనకు 62 కోట్లకు పైగా విలువైన స్థిరాస్థులు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం.. మంత్రుల ఆస్తుల తాలూకు వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేసింది. కొన్నేళ్ల క్రితం తన సోదరి గీతా మెహతా నుంచి తీసుకున్న రూ. 15 లక్షల అప్పును తాను తిరిగి చెల్లించలేదని కూడా నవీన్ పట్నాయక్ తెలిపారు. ఆయన తరువాత 9 కోట్లకు పైగా విలువైన ఆస్తులతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ప్రతాప్ జెనా రెండో స్థానంలో నిలిచారు. ఆరోగ్య శాఖ మంత్రి నబా కిషోర్ తనకు 2 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ కోటి మేర బ్యాంకు డిపాజిట్లు, 32 లక్షల నగదు ఉన్నట్టు ప్రకటించారు.
అయితే మంత్రుల్లో కెల్లా తను అతి పేద మంత్రినని క్రీడా శాఖ మంత్రి తుష్కర్ కాంతి బెహరా పేర్కొన్నారు. ‘నాకు రూ. 26 లక్షల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇందులో రూ. 5 లక్షల కారు, 4,800 చదరపు అడ్గుగుల భూమి ఉన్నాయి’ అని తుష్కర్ వివరించారు.