కర్ణాటకలో ‘లోకల్ లొల్లి’.. స్థానికులకే జాబ్ రిజర్వేషన్స్.?. తెలుగోడి ‘గోడు’ పట్టదా ?

కర్నాటకలో లోకల్ లొల్లి మళ్ళీ మొదలైంది. స్థానికులకే ఉద్యోగాలను రిజర్వ్ చేయాలన్న ఆందోళన మళ్ళీ పుంజుకుంటోంది. ఈ డిమాండుతో ‘ కర్నాటక సంఘటననెగళ్ ఒక్కోట’ సహా మరికొన్ని కన్నడ సంఘాలు 12 గంటల బంద్ కు  పిలుపునిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం 6 గంటలకు బంద్ మొదలైంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు జాబ్స్ రిజర్వ్ చేయాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లోకల్స్ కే వీటిని రిజర్వ్ చేయాలని సుమారు 37 ఏళ్ళ […]

కర్ణాటకలో 'లోకల్ లొల్లి'.. స్థానికులకే జాబ్ రిజర్వేషన్స్.?. తెలుగోడి 'గోడు' పట్టదా ?
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 13, 2020 | 2:36 PM

కర్నాటకలో లోకల్ లొల్లి మళ్ళీ మొదలైంది. స్థానికులకే ఉద్యోగాలను రిజర్వ్ చేయాలన్న ఆందోళన మళ్ళీ పుంజుకుంటోంది. ఈ డిమాండుతో ‘ కర్నాటక సంఘటననెగళ్ ఒక్కోట’ సహా మరికొన్ని కన్నడ సంఘాలు 12 గంటల బంద్ కు  పిలుపునిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం 6

గంటలకు బంద్ మొదలైంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు జాబ్స్ రిజర్వ్ చేయాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లోకల్స్ కే వీటిని రిజర్వ్ చేయాలని సుమారు 37 ఏళ్ళ క్రితమే సరోజినీ మహిషి కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించిందని, దాన్ని అమలు చేయాలని ఈ సంస్థలు కోరుతున్నాయి. కర్నాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఈ సంస్థల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం జనతా పార్టీ నేత అయిన సరోజినీ మహిషి.. 1983 లోనే తన  రిపోర్టును సమర్పించినా.. 1986 లో ప్రభుత్వం.. ఈ సిఫారసుల్లో 45 సూచనలను ఆమోదించింది.. గ్రూప్ ‘సీ’, గ్రూప్

‘డీ’కేటగిరీల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు, గ్రూప్ ‘ఏ’కేటగిరీలో 65 శాతం కోటాను కూడా నిర్దేశించాలని ఆ నివేదిక సూచించింది. అయితే ఈ డిమాండ్ ఊపందుకోవడంతో.. కర్నాటకలోని తెలుగువారు బెంబేలెత్తుతున్నారు.