Republic Day: రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనాలనుకుంటున్నారా .. ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోండి ఇలా
సామాన్యులు కూడా రిపబ్లిక్ డే వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకుంటారు. అటువంటి వారికోసం రక్షణ మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రక్షణ మంత్రిత్వ శాఖ రూపొందించిన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా సామాన్యులకు కల్పిస్తోంది.
భారతదేశం తన 74 వ గణ తంత్ర దినోత్సవాన్ని ఈ సంవత్సరం జనవరి 26, 2023న జరుపుకోనుంది. దేశ రాజధాని ఢిల్లీ కర్తవ్య పథ్ వేదికగా ఈ రిపబ్లిక్ డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా పరేడ్‌తో పాటు గొప్ప వేడుకలు జరుగుతాయి. రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని ప్రముఖులకు, అతిథులకు ఆహ్వానం ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా పంపబడుతుంది. అయితే సామాన్యులు కూడా ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకుంటారు. అటువంటి వారికోసం రక్షణ మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రక్షణ మంత్రిత్వ శాఖ రూపొందించిన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా సామాన్యులకు కల్పిస్తోంది. పోర్టల్ టిక్కెట్ బుకింగ్, అడ్మిట్ కార్డ్‌లు, ఆహ్వాన కార్డులు, కార్ లేబుల్స్ వంటి వివిధ సౌకర్యాలను అందిస్తుంది.
ప్రతి రోజు, టిక్కెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో ఉదయం 9 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్‌లను బుక్ చేసుకునేటప్పుడు సంభవించే ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి వినియోగదారులు రెండు ఫోన్ నంబర్‌లను అందించాలి. ఈవెంట్, టిక్కెట్ రకం ఆధారంగా టిక్కెట్ ధర రూ. 20 నుండి రూ. 500 వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే పౌరులకు ఉద్యోగ్ భవన్, సెంట్రల్ సెక్రటేరియట్‌కు ఉచిత మెట్రో ట్రైన్ లో ప్రయాణించే అదనపు సౌకర్యాన్ని కల్పిస్తుంది.
ప్రగతి మైదాన్, సేన భవన్, జంతర్ మంతర్, శాస్త్రి భవన్, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లలో సాధారణ ప్రజలు కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
రిపబ్లిక్ డే పరేడ్ 2023: ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను ఎలా బుక్ చేసుకోవాలంటే..
- స్టెప్ 1: వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్ www.aamantran.mod.gov.in లోకి సైన్ అప్ అవ్వాలి.
- స్టెప్ 2: తర్వాత.. వినియోగదారుడు తమ మొబైల్ నంబర్‌ను నోట్ చేసి.. తద్వారా లేదా వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.
- స్టెప్ 3: భర్త పేరు లేదా తండ్రి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ .. శాశ్వత చిరునామా వంటి వివరాలను ఎంట్రీ చెయ్యాలి.
- స్టెప్ 4: తర్వాత మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు OTP వస్తుంది.
- స్టెప్ 5: అప్పుడు మీరు పాల్గొనాలనుకుంటున్న ఈవెంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో FDR – రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్, రిహార్సల్ – బీటింగ్ ది రిట్రీట్, బీటింగ్ ది రిట్రీట్ – FDR, బీటింగ్ ది రిట్రీట్ వంటి వేడుకల ఈవెంట్స్ ఉన్నాయి.
- స్టెప్ 6: అధికారిక సైట్‌లో టిక్కెట్‌ల రకం, ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయి, ధరలు, ఎన్‌క్లోజర్‌లను చూపిస్తుంది.
- స్టెప్ 7: ఇప్పుడు అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి.. తర్వాత మీ ID కార్డుని అప్‌లోడ్ చేయండి.
- స్టెప్ 8: వినియోగదారు ఒక మొబైల్ నంబర్‌తో 10 టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.
- స్టెప్ 9: ID కార్డ్ గా పూర్తి చిరునామాను కలిగి ఉన్న ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ , ఓటర్ IDలను ఉపయోగించవచ్చు
- స్టెప్ 10: అప్‌లోడ్ చేయబడిన చిత్రం .png లేదా .jpg ఫార్మాట్ రూపంలో ఉండాలి.. ఫోటో సైజ్ 1 MB కంటే తక్కువ ఉండాలి.
- స్టెప్ 11: చివరగా,.. ఎంచుకున్న టికెట్ ధరను చెల్లించాలి.
- స్టెప్ 12: జనరేట్ చేయబడిన టిక్కెట్‌లు రిపబ్లిక్ డే వేదికను కలిగి ఎంట్రీకి ప్రత్యేకమైన QR కోడ్‌ని కలిగి ఉంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..