‘ పాత అలవాట్లు ఎక్కడికి పోతాయ్ ఇమ్రాన్ ‘ ?
యూపీలో ముస్లిములపై పోలీసుల దాడికి ఇదే నిదర్శనమంటూ తాను షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ( ఈ వీడియోను ఆయన ఆతరువాత డిలీట్ చేశారు). ముస్లిములపై భారత పోలీసుల దుశ్చర్య అంటూ ఆయన దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. పైగా నన్ కన్నా సాహిబ్ గురుద్వారాను చుట్టుముట్టిన వందలాది ఆందోళనకారుల నుంచి ఈ గురుద్వారాను, అందులోని భక్తులను రక్షించాలని, ఇందుకు మీ సహాయం కావాలని పంజాబ్ […]
యూపీలో ముస్లిములపై పోలీసుల దాడికి ఇదే నిదర్శనమంటూ తాను షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ( ఈ వీడియోను ఆయన ఆతరువాత డిలీట్ చేశారు). ముస్లిములపై భారత పోలీసుల దుశ్చర్య అంటూ ఆయన దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. పైగా నన్ కన్నా సాహిబ్ గురుద్వారాను చుట్టుముట్టిన వందలాది ఆందోళనకారుల నుంచి ఈ గురుద్వారాను, అందులోని భక్తులను రక్షించాలని, ఇందుకు మీ సహాయం కావాలని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ తనను కోరారని కూడా ఇమ్రాన్ చెప్పుకొన్నారు. (వీడియోలో నిరసనకారులు గురుద్వారాలో భక్తులపై రాళ్లు రువ్వుతున్న ఉదంతం కూడా ఉంది). అయితే అసలు విషయంలోకి వెళ్తే.. నిజానికిది ఏడేళ్ల క్రితం.. 2013 లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ ఘటన తాలూకు ఫుటేజీ అని స్పష్టమైంది.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి ధ్వజం…
దీంతో ఇమ్రాన్ నిర్వాకంపై స్పందించిన ఐరాస లోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్.. ఇమ్రాన్ ఖాన్ మాటిమాటికీ ‘ తప్పులు ‘ చేస్తున్నారని దుయ్యబట్టారు. పాత అలవాట్లు ఎక్కడికి పోతాయంటూ హ్యాష్ ట్యాగ్ తో సంబంధిత వీడియో క్లిప్ ను కూడా మళ్ళీ షేర్ చేశారు. అసలు నన్ కన్నా గురుద్వారాపై ఎలాంటి దాడీ జరగలేదని, ఆ మందిరానికి ఏ విధమైన డ్యామేజీ కూడా కాలేదని ఆ తరువాత పాకిస్థాన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.