ఎల్ఓసీ వద్ద భారీగా ఉగ్రవాదుల మోహరింపు.. ఆర్మీ చీఫ్ షాకింగ్ న్యూస్ !
వాస్తవాధీన రేఖవద్ద దాదాపు 250 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు మోహరించి ఉన్నారని కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే షాకింగ్ న్యూస్ చెప్పారు. వారు ప్రతిరోజూ భారత భూభాగంలోకి చొచ్ఛుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే మన సైన్యం అప్రమత్తంగా ఉందని ఆయన వెల్లడించారు. అలాగే ఎల్ఓసీ పొడవునా 20 నుంచి 25 లాంచ్ పాడ్స్ ఏర్పాటు చేశారని, కానీ ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపారు. బాల కోట్ లో పాక్ మళ్ళీ ఉగ్రవాద శిబిరాలను యాక్టివేట్ […]
వాస్తవాధీన రేఖవద్ద దాదాపు 250 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు మోహరించి ఉన్నారని కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే షాకింగ్ న్యూస్ చెప్పారు. వారు ప్రతిరోజూ భారత భూభాగంలోకి చొచ్ఛుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే మన సైన్యం అప్రమత్తంగా ఉందని ఆయన వెల్లడించారు. అలాగే ఎల్ఓసీ పొడవునా 20 నుంచి 25 లాంచ్ పాడ్స్ ఏర్పాటు చేశారని, కానీ ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపారు. బాల కోట్ లో పాక్ మళ్ళీ ఉగ్రవాద శిబిరాలను యాక్టివేట్ చేసిందని చెప్పిన ఆయన.. సరిహద్దుల్లో ఉగ్రవాద క్యాంపులు, లాంచ్ పాడ్ల లొకేషన్లను మారుస్తున్నారని పేర్కొన్నారు.టెర్రర్ శిబిరాలను మదరసాల ద్వారానో, ఇతర భారీ సంస్థల ద్వారానో నిర్వహిస్తున్నారనే అభిప్రాయం ఉందని, అయితే వీటిని చిన్నపాటి గుడిసెల్లో కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసిందని అన్నారు. కాశ్మీర్ లోయలో విపరీతంగా మంచు కురుస్తున్నందున పాక్ టెర్రరిస్టులు సరిహద్దుల ద్వారా చొచ్ఛుకు రాలేకపోతున్నారని మనోజ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు. కొంతమంది విదేశీ ఉగ్రవాదులు కూడా రహస్యంగా మన దేశంలోకి చొరబడే యత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏమైనా బాల కోట్ లో కొత్తగా ఏర్పాటైన టెర్రరిస్టు శిబిరాలపై సదా నిఘా పెడుతున్నట్టు ఆయన వివరించారు.