Boyfriend on rent for Valentine’s Day 2023: ‘వాలెంటైన్స్‌ డేకు ఇచట అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ సర్వీస్‌ దొరకును’.. టెకీ వినూత్న ప్రచారం

వాలంటైన్స్‌ డే నాడు జంటలు ఒకరికొకరు 'ఐ లవ్‌ యూ' అంటూ తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఐతే సింగిల్స్‌ బోర్‌ ఫిలవకుండా ఉండాలంటే మా డేటింగ్‌ సేవలు వినియోగించుకోండంటూ..

Boyfriend on rent for Valentine’s Day 2023: వాలెంటైన్స్‌ డేకు ఇచట అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ సర్వీస్‌ దొరకును.. టెకీ వినూత్న ప్రచారం
Boyfriend On Rent

Updated on: Feb 13, 2023 | 5:50 PM

వాలంటైన్స్‌ డే నాడు జంటలు ఒకరికొకరు ‘ఐ లవ్‌ యూ’ అంటూ తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఐతే సింగిల్స్‌ బోర్‌ ఫిలవకుండా ఉండాలంటే మా డేటింగ్‌ సేవలు వినియోగించుకోండంటూ హర్యాణాలోని గురుగ్రాంకు చెందిన షకూల్‌ గుప్తా (31) అనే టెకీ వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. ఈ వాలెంటైన్స్‌ డే (2023) నాడు పాట్నర్‌ కోసం వెదికే యువతులకు సరసమైన ధరలకు అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌ (Rent a Boyfriend Service)ను అందిస్తామని పోస్టర్‌తో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చేసిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. లోన్లీనెస్‌తో ఫీల్‌ అవుతున్న వారికి స్నేహితుడిగా ఆపన్నహస్తం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐతే అందుకు కొంత మొత్తంలో ఛార్జి వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ విధమైన డేటింగ్‌ సర్వీస్‌లు తొలిసారిగా అందించడంలేదని, గత ఐదేళ్ల (2018) నుంచి మహిళలకు డేటింగ్‌ సేవలు అందిస్తున్నానని, ఇప్పటి వరకు 50 మందికిపైగా యువతులతో డేటింగ్‌కి వెళ్లినట్లు తెలిపాడు. ఐతే దీని వల్ల తాను గతంలో ట్రోల్స్‌కు గురైనట్లు పేర్కొన్నాడు.

‘అందరూ ‘గిగోలో’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. కానీ నేను దాన్ని చూసే విధానం వేరే. నా డేటింగ్‌ ఎప్పుడూ ప్రేమను పంచుతూనే ఉంటుంది. అది విలువకట్టలేనిది. మీరు లోన్లీగా ఫీలైతే ఏ మాత్రం సంకోచించకుండా మీ ఒంటిరి తనం దూరం చేసుకోవడానికి, నా సేవలు వినియోగించుకోండి’ అంటూ రాసుకొచ్చాడు. నిజానికి తన జీవితంలో ఎదురైన అనుభవం నుంచే ఈ ‘అద్దెకు బాయ్ ఫ్రెండ్’ అనే కాన్సెప్ట్‌ను తీసుకువచ్చినట్లు షాకుల్ గుప్తా తెలిపాడు. తమకూ ఓ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండునని ఒంటరి యువత భావిస్తుందని, ఆ సమయంలో వారిని ఒంటరితనం వేధిస్తుందని, తాను కూడా గతంలో బాధపడ్డానని షాకుల్ తెలిపాడు. అందుకే ఈ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చానని, ఎవరైనా బుక్ చేసుకోవచ్చని వివరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.