ఓర్నీ ఇదెక్కడి వింత.. నీలం రంగు గుడ్డు పెట్టిన నాటు కోడి!.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా కోడి గుడ్డు ఏ రంగులో ఉంటుంది. ఒకటి తెలుపు, లేదా గోదుమ. మన ఇళ్లలో పెంచుకునే, లేదా ఫామ్‌లలో పెరిగే నాటు కోళ్లు ఇలాంటి గుడ్లను పెడుతాయి. కాబట్టి మనం కూడా వీటిని ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడో నాటుకోడి మాత్రం విచిత్రంగా నీలి రంగు గుడ్డుపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆ కోడి గుడ్డును చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ వింత ఘటన కర్ణాటక జిల్లాలోని నల్లూరు అనే గ్రామంలో వెలుగు చూసింది.

దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకా నల్లూర్ గ్రామానికి చెందిన సయ్యద్ నూర్‌కు చెందిన కోడి అకస్మాత్తుగా నీలిరంగు గుడ్డు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. సయ్యద్ నూర్ తన జీవనోపాధిలో భాగంగా పది కోళ్లను పెంచుకుంటున్నాడు. ఈ కోళ్లు సాధారణంగా తెల్ల గుడ్లు పెడతాయి. అయితే, ఇటీవల, ఒక కోడి ఊహించని విధంగా నీలిరంగు గుడ్డు పెట్టింది. అది చూసిన సయ్యద్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. తర్వాత ఆ గుడ్డును తీసుకొని భద్రంగా దాచి పెట్టాడు. అలాగే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చుట్టుపక్కల గ్రామాలతో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టికి వెళ్లిందిజ.
ఇది కూడా చదవండి: ఓసినీ.. ఎంత పనిచేశావే.. క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లి చెట్టెక్కిన కోతి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!
విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఈ గుడ్డును పరిశీలించారు. ఈ అరుదైన సంఘటనపై ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ.. ఈ నీలం రంగుకు కారణం గుడ్డు లోపల బిలివర్డిన్ అనే వర్ణద్రవ్యం కావచ్చునని అన్నారు. ఈ వర్ణద్రవ్యం కొన్ని కోళ్ల జాతులలో కనిపిస్తుందని.. గుడ్డు పెంకు పైభాగంలో నీలం లేదా ఆకుపచ్చ రంగును కలిగిస్తుందని అన్నారు. అయితే, ఈ గుడ్డు లోపల నాణ్యత సాధారణ గుడ్డు మాదిరిగానే ఉంటుందని ఎటువంటి తేడా లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మీకో సవాల్.. ఈ ఫోటోలో ఎన్ని అంకెలున్నాయో చెప్పగలరా?.. చెప్తే మీరే తోపులు!
సయ్యద్ ఇంటికి అధికారులు రావడంతో గ్రామంలోని స్థానికులంతా అతని ఇంటికి వచ్చి నీలిరంగు గుడ్డును చూసేందుకు ఎగబడ్డారు. అయితే కొందరు దీనిని అదృష్టానికి సంకేతంగా నమ్ముతున్నారు. మరికొందరు శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.ఈ కోడి నిరంతరం నీలి గుడ్లు పెడుతుంటే, దానిని శాస్త్రీయంగా మరింత పరిశీలిస్తామని డాక్టర్ అశోక్ తెలిపారు. ఇటువంటి అరుదైన సంఘటనలు కోడిలోని జన్యు, జీవరసాయన కారకాలకు సంబంధించినవి కావచ్చని ఆయన అన్నారు.
ఈ సంఘటన అడవి కోళ్లను పెంచడం ద్వారా జీవనోపాధి పొందే రైతులలో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ఈ నీలి గుడ్లు మార్కెట్లో ప్రత్యేక డిమాండ్‌ను సృష్టిస్తాయా అని గ్రామస్తులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ కోడి ఆరోగ్యం, గుడ్ల ఉత్పత్తిని పర్యవేక్షించడానికి పశుసంవర్ధక శాఖ ప్రణాళిక వేసింది. ఈ అరుదైన సంఘటన గురించి మరింత సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: ఇంట్లో ప్రియుడితో ఏకాంతంగా మహిళ.. అంతలోనే తలుపుకొట్టిన భర్త.. కట్‌చేస్తే..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
