The Betrayed Queen : చరిత్ర పుటల్లో లేని.. పోర్చుగీసువారిని వణికించిన గొప్ప వీరనారి… ఈ రాణి గురించి ఎంత మందికి తెలుసు?

ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక యుద్ధ నౌకకు ఒక మహిళ పేరు కాని, రాణి పేరు పెట్టలేదు. కానీ ఒక మన భారతదేశం నౌకలు మాత్రమే ఆ అదృష్టం చేసుకున్నాయి...

The Betrayed Queen : చరిత్ర పుటల్లో లేని.. పోర్చుగీసువారిని వణికించిన గొప్ప వీరనారి... ఈ రాణి గురించి ఎంత మందికి తెలుసు?
Follow us
Surya Kala

|

Updated on: Mar 08, 2021 | 7:06 PM

The Betrayed Queen : మాతృదేవో భవ అంటూ మనదేశం ఎప్పుడో స్త్రీలకు తొలిప్రాధాన్యతను ఇచ్చింది. తమ పౌరుష ప్రతాపాన్ని చూపించిన ఎందరో మగువులను కన్న పుణ్యభూమి. ఇక ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక యుద్ధ నౌకకు ఒక మహిళ పేరు కాని, రాణి పేరు పెట్టలేదు. కానీ ఒక మన భారతదేశం నౌకలు మాత్రమే ఆ అదృష్టం చేసుకున్నాయి. అయితే అంతటి గొప్ప వీరవనిత చరిత్ర మన చరిత్రపుటల్లో ఏ పుస్తకంలోనూ నోచుకోలేకపోయింది. ఏ పాఠ్యపుస్తకము చెప్పని రాణి_అంబాక్క చరిత్ర ఈ రోజు తెలుసుకుందాం..!

భారతీయ చరిత్రలో పలుమార్లు పోర్చుగీస్ వాళ్లను ఓడించిన ఒకే ఒక ధీరవనిత మహారాణి రాణి అంబాక్క. ఆమె ధైర్యం లో, వీరత్వం లో రాణి లక్ష్మీ బాయి, రాణి రుద్రమ దేవికి మరియు రాణి దుర్గావతి కీ సరిసమానమైన వ్యక్తి. అయితే ఈ రాణి ప్రస్తావన అతి తక్కువగా వినిపిస్తుంది.  మాతృదేశం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన ధీర వనిత రాణి అంబక్క. పోర్చుగీస్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని ఘట్టం.  భారతదేశం ఉన్నన్ని రోజులు ఈ భారతీయులందరికీ ఆమె ధీరత్వం గుర్తుండాలని 2015 లో నౌకా దళం లోని ఒక నౌకకీ రాణి_అంబాక్క పేరు పెట్టి మన నౌకాదళం ప్రభుత్వం తన రుణం తీర్చుకుంది.

7 శతాబ్దం నుండి మన భారతదేశానికి అరేబియన్ దేశాలకు మధ్య వాణిజ్య సంబంధాలుండేవి . యుద్ధ గుర్రాలు, మసాలా దినుసులు, బట్టల వ్యాపారం జరిగేది. చాలా యూరోపియన్ దేశాలు మన భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి అప్పటికి. 1498 లో మొదటిసారి వాస్కోడిగామా మన భారతదేశంలోని కాలికట్ ప్రాంతానికి సముద్రమార్గాన్ని కనిపెట్టాడు. దీంతో యూరోపియన్ దేశాల్లో ఒకటైన పోర్చు గీసు భారతదేశంలోకి వ్యాపారం నిమిత్తం అడుగు పెట్టింది.    అనంతరం వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టి.. వివిధ దేశాలను కలుపుతూ అనేక నౌకాశ్రయాలు కట్టారు. మనదేశం తో సహా మస్కట్, మొజాంబిక్, శ్రీలంక, ఇండోనేసియా తోపాటు చైనాలో ఉన్న మకావ్ ను లుపుతూ సముద్ర మార్గాన్ని నిర్మించారు. అలా మెల్లగా తన వ్యాపార కార్యకలాపాలను పెంచుకుంటూ.. 20 ఏళ్ళల్లో పోర్చుగీస్ వారు ఈ సముద్ర మార్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది.

అయితే అంతవరాకూ భారతీయులకు, అరబ్బులకు, పెర్షియన్ ,  ఆఫ్రికన్ దేశాలు హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంపై రవాణాను  ఉచితంగా చేసుకుంటుండేవి. అయితే  ఈ సముద్ర మార్గంలో పోర్చుగీస్ ఆధిపత్యం పెరిగిందో అప్పటి నుండి సముద్ర రవాణా చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలని వాళ్లు రుసుములు వసూలు చేయడం మొదలు పెట్టారు. తమకు స్థానికంగా ఎదురు తిరిగిన రాజులను ఓడించి పోర్చుగీసువారు ఆ మార్గాన్ని సొంతం చేసుకున్నారు.

1526 లో పోర్చుగీస్ వారు మంగళూర్ పోర్ట్ ని ఆక్రమించిన తర్వాత.. వారి దృష్టి తదుపరి లక్ష్యం ఉల్లాల పోర్ట్ పైన పడింది. ఈ ప్రాంతం చౌత రాజు తిరుమలరాయ_lll రాజధాని.  వీరు  మొదట జైన్ రాజులు.  2శతాబ్దం లో గుజరాత్ నుండి వలస వచ్చారు.  మాతృస్వామ్య వ్యవస్థకలిగిన  రాజవంశీయులు. ఆ రాజు వాళ్ళ మేనకోడలే రాణి అంబక్క. తిరుమలరాయ అంబాక్క ను దత్తత తీసుకొని రాజ్యానికి రాణిగా ప్రకటించాడు. ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు కత్తియుద్ధం, విల్లు విద్య, ఆశివికధల, సైనికవ్యూహం, దౌత్య పరమైన అన్ని విద్యలలో చిన్నప్పటి నుండే తర్ఫీదు ఇచ్చారు. దీంతో ఆమె పాలనాదక్షతలో , యుద్ధ విద్యల్లో మగవారితో సమానంగా ఆరితేరారు.

అంబక్క రాజ్య సింహాసనం అధిరోహించిన నాటి నుండే రాజ్యానికి పోర్చుగీస్ నుండి ఉన్న ముప్పు తెలుసు. తిరుమలరాయ  మరణించే ముందు అంబక్క నీ మంగళూరు కు చెందిన లక్ష్మప్ప బంగరజతో వ్యూహాత్మక వివాహ కూటమి ఒప్పందంతో పెళ్లి జరిపించారు. అయితే   పెళ్లి అయినా కూడా అంబక్క ఉల్లాలా లో నే తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్నారు. బంగరజా పోర్చుగీస్ తో సంధి చేసుకోవడంతో కొన్ని రోజులకు వాళ్ళ వివాహ బంధం తెగిపోయింది

అంబక్క నాయకత్వంలో వెలిగిపోతున్న ఉల్లల రాజ్యం పైన పోర్చుగీసు వారి కన్నుపడింది. ఆమెనుంచి అధిక పన్నులు వసూలు చేయడమే కాదు ఆమె పైన మితిమీరిన ఆంక్షలు వేయడంతో పోర్చుగీస్ కి ఎదురు తిరిగింది. పోర్చుగీస్ వాళ్లు తన ఓడల పైన దాడి చేసినా అరబ్స్ తో వ్యాపారం చేయడం ఆపలేదు..  ఆమె మొండిపట్టు ని చూసి పోర్చుగీస్ పలుమార్లు ఉల్లలా పైన దాడి చేశారు. 1556 సంవత్సరంలో మొదటి సారి పోర్చుగీస్ అడ్మిరల్ డాన్ అల్వారో డి సివేరియా ఆధ్వర్యంలో యుద్ధం చేశారు. అయితే అది అనుకూల సంధితో ముగిసింది. ఇక మళ్లీ 2 ఏళ్ల తర్వాత పోర్చుగీస్ అతి పెద్ద సైన్యంతో ఉల్లాల పైకి మళ్ళీ యుద్ధానికి వచ్చారు. అప్పుడు అంబక్క తన యుద్ధ నైపుణ్యంతో అరబ్బులు మరియు కోజికోడ్ వారితో చేతులు కలిపి పోర్చుగీస్ వారిని ఓడించి వెను తిరిగేలా చేసింది..

మళ్ళీ జనరల్ జోయా పెక్సిఎక్సోటో ఆధ్వర్యంలో మరోసారి పైన దాడి చేసి కోటను ఆక్రమించుకున్నారు. కానీ అప్పటికే వాళ్ళ దాడిని గ్రహించిన రాణి ఆ కోట నుండి తప్పించుకుని పారి పోయింది. అదే రోజు రాత్రి ఆమెకు నమ్మకం గా ఉండే 200 మంది సైనికులతో పోర్చుగీస్ స్థావరాలపై మహాకాళి ల రౌద్రరూపం దాల్చి విరుచుకుపడింది 70 మంది సైనికులతో పాటు ఆమె కోటను ఆక్రమించిన జనరల్ ని నరికి చంపింది.

రాణి అంబాక్క దైర్యం , మనో నిర్భయం మిగతా రాజులకు కూడా స్ఫూర్తినిస్తున్న విషయం పోర్చుగీస్ జీర్ణించుకోలేకపోయారు. వేరే రాజులతో ఆమెను బెదిరించడానికి చూసారు. అంతేకాదు తన భర్త కూడా ఉల్లాల రాజ్యంపై యుద్ధం చేసి తగులబెడతామని బెదిరించినా అంబక్క బెదరలేదు. ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా నా అదరని బెదరని రాణిఅంబాక్క ని  చూసి పోర్చుగీస్ ఖంగుతిన్నారు.

ఈసారి గోవా ను పాలిస్తున్న పోర్చుగీసు ముఖ్య నేతలను రంగంలోకి దింపారు. 1571 లో మూడువేల మంది పోర్చుగీస్ సైన్యంతో ఉల్లాల పైన మెరుపు దాడి చేశారు.. రాణిఅంబాక్క తన కులదైవాన్ని దర్శనం చేసుకొని కోటకు బయలుదేరి వస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే తన గుర్రాన్ని యుద్ధ రంగం వైపు తిప్పింది.  అటునెల పైన, సముద్రంలోనూ యుద్ధం భీకరంగా సాగింది. అంబక్క పరాక్రమ దాటికి పోర్చుగీస్ సైన్యం పారిపోయింది. అటు పిమ్మట ఒడ్డుపైన ఉన్న తన సైన్యంతో అగ్నిబాణలు వేస్తూ పోర్చుగీసు సైన్యాన్ని మట్టుబెట్టింది. అయితే యుద్ధంలో గాయపడిన రాణి అంబక్క ని ఎలాగైనా చంపాలని పోర్చుగీసు వారు సామంతులకు డబ్బు ఎరగా వేసి ఆమె పైకి యుద్ధం చేయించారు. కానీ భయమంటే ఎరుగని రాణి తనకు గాయాలపాలైన కూడా లెక్క చేయకుండా యుద్ధం చేస్తూ కదనరంగంలో కన్నుమూసింది. వీరనారిగా చరిత్రలో నిలిచిపోయింది.

Also Read :

కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి