Parliament: పార్లమెంట్‌లో రామాయణం సినిమా ప్రదర్శన..స్పెషల్ గెస్ట్ ఎవరంటే..?

పార్లమెంట్‌లో రామాయణం సినిమా ప్రదర్శనకు అంతా సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 15వ తేదీన ఈ సినిమా షో వేయనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గీక్ పిక్చర్స్‌ ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Parliament: పార్లమెంట్‌లో రామాయణం సినిమా ప్రదర్శన..స్పెషల్ గెస్ట్ ఎవరంటే..?
Ramayana Movie
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 02, 2025 | 5:43 PM

1993లో విడుదలైన జపనీస్-ఇండియన్ యానిమేషన్ మూవీ రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ సినిమాని పార్లమెంట్‌లో ప్రదర్శించనున్నట్టు గీక్ పిక్చర్స్‌ వెల్లడించింది. ఈ షోకి పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారని ప్రెస్‌రిలీజ్‌లో ప్రస్తావించింది. దీంతో పాటు సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులనూ ఆహ్వానించినట్టు తెలిపింది. పార్లమెంట్‌లో తమ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అనుమతినివ్వడంపై గీక్ పిక్చర్స్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అవకాశాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించింది. రామాయణం ఎన్ని తరాలకైనా ఆదర్శంగా నిలుస్తుందని, అలాంటి చిత్రాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించడం నిజంగా గొప్ప విషయమని వివరించింది.

అయితే..రామాయణ..ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా యానిమేషన్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 24వ తేదీన హిందీ, తమిళం, తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోనూ డబ్ చేసి విడుదల చేశారు. 4K ఫార్మాట్‌లో రిలీజైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. AA ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియాలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమాని యుగో సకో, రామ్ మోహన్, కొయిచి ససకీ డైరెక్ట్ చేశారు. మరో హైలైట్ ఏంటంటే…హిందీ రామాయణంలో రాముడిగా నటించి పేరు తెచ్చుకున్న అరుణ్ గోవిల్..ఈ సినిమా హిందీ వర్షన్‌కి డబ్బింగ్ చెప్పారు. శత్రుఘ్ను సిన్హా సినిమాకి నరేటర్‌గా తన వాయిస్ అందించారు. బాహుబలి రైటర్, ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్…ఈ సినిమాకి సంబంధించిన క్రియేటివ్ అడాప్షన్ బాధ్యతలు తీసుకున్నారు. 1993లోనే రామాయణ, ది లిజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్క్రీనింగ్ అయింది. కాకపోతే..అప్పట్లో ఇది థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఆ తరవాత టీవీ ఛానల్స్‌లో టెలికాస్ట్ అయ్యాక ఒక్కసారిగా ఇండియాలోనూ పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఇదే సినిమాని పార్లమెంట్‌లో ప్రదర్శిస్తుండడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??
జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??
కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??
కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??
షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న కీలక వ్యాఖ్యలు!
షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న కీలక వ్యాఖ్యలు!
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..
అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
ఇంకా తగ్గని పుష్ప రాజ్ మేనియా.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..
ఇంకా తగ్గని పుష్ప రాజ్ మేనియా.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..