ప్రతి రోజూ చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. ఎప్పుడైనా ఆలోచించారా?
samatha
11 march 2025
Credit: Instagram
చికెన్ ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే నాన్ వెజ్‌లో చికెన్ ఫస్ట్ ఫ్లేస్‌లో ఉంటుంది.చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు.
కొందరు వారానికి ఒకసారి లేదా, రెండు సార్లు చికెన్ తింటే, మరికొందరు మాత్రం రోజూ చికెన్‌తో డిఫరెంట్ ఐటమ్స్ చేసుకొని తింటుంటారు.
అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోజూ క్రమం తప్పకుండా చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అని దాని గురించే తెలుసుకుందాం.
విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉన్నప్పటికీ, చికెన్‌ను ప్రతి రోజూ తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్యులు.
చికెన్ ఎక్కువగా తినడం వలన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుందంట. దీని వలన ఎముకలు మరియు కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
అంతే కాకుండా ప్రతి రోజూ చికెన్ తినడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందంట. ఎందుకంటే ఇందులో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది.
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు అస్సలే ప్రతి రోజూ చికెన్ తినకూడదంట. దీని వలన కిడ్నీ వ్యాధి రావడమే కాకుండా, కాలేయం చుట్టూ కొవ్వు పెరుగుతుందంట.
చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టీ ప్రతి రోజూ చికెన్ తినడం వలన ఇది శరీరంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచుతుందంట. దీని వలనమూత్ర నాళ వ్యాధి ప్రమాదం కూడా పెరుగుతుందంట.