AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం..

మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం ఆ దేశ అత్యున్నత పురస్కారం 'ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్'ను ప్రధాని మోదీకి ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం..
Pm Modi
Ravi Kiran
|

Updated on: Mar 11, 2025 | 8:26 PM

Share

మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ను ప్రధాని మోదీకి ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ప్రధాని మోదీ కాగా.. ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం.

ప్రధాని మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన పోర్ట్ లూయిస్‌లో జరిగిన మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలోనే మారిషస్ ప్రధాని రామ్‌గులం ప్రధాని మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. మార్చి 12, 1992న మారిషస్ స్వతంత్ర దేశంగా మారిన నాటి నుంచి ఐదుగురు విదేశీ ప్రముఖులను ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది హిందూ మహాసముద్రం’తో సత్కరించారని రామ్‌గులం అన్నారు. 1998లో జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా దీనిని మొదటిసారిగా అందుకున్నారని ఆయన అన్నారు.

మరోవైపు ప్రధాని మోదీ మారిషస్ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. మారిషస్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మారిషన్‌ రాజధాని పోర్టు లూయిస్ చేరుకున్నారు. అక్కడి భారతీయ సమాజం ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికింది. ప్రధాని గౌరవార్థం బిహార్‌ సంప్రదాయ పద్ధతి గీత్‌ గవాయ్‌ ఏర్పాటు చేశారు. అక్కడి మహిళలు సాంప్రదాయ బీహారీ భోజ్‌పురి సంగీతం ‘గీత్ గవాయ్’తో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు మారిషస్‌ సంస్కృతిలో భోజ్‌పురి భాష భాగం కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

సాంస్కృతిక మార్పడిలో భాగంగా మారిషస్‌ అధ్యక్షుడు ధరమ్బీర్‌ గోకుల్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు అందించారు. ఇత్తడి,రాగితో చేసిన ప్రత్యేక కలశంలో తీసుకెళ్లిన మహాకుంభమేళా సంగమ జలాలను బహుకరించారు. బిహార్‌ నుంచి తీసుకొచ్చిన మకానాతో పాటు డ్రై ఫ్రూట్స్‌ను అందించారు. మారిషన్ అధ్యక్షుడి భార్య బృందా గోకుల్‌కు గుజరాత్‌లో నేసిన బెనారస్‌ పట్టు చీరను అందజేశారు. అది అందిస్తూ ఇది తన స్వరాష్ట్రంలో తయారైన చీర అని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు. బిహార్‌లో ప్రత్యేకంగా సాగు చేసే మఖానాను కూడా ప్రధాని బహుమతిగా అందించారు. ఎన్నో శతాబ్ధాల నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య , సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు మోదీ. అంతకముందు మారిషస్ ప్రధాని నవీన్‌ రామ్‌గోలంతో కలిసి సర్‌సీవూసాగర్ రామ్‌గులం బొటానికల్ గార్డెన్‌లో ఒక మొక్కను నాటారు ప్రధాని మోదీ.

మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే