సమ్మర్‌లో కూల్‌గా ఉండాలా.. పెరుగుతో  తయారు చేసే ఈ ఫుడ్ తినాల్సిందే!

samatha 

11 march 2025

Credit: Instagram

సమ్మర్ వచ్చిందంటే చాలు  చాలా మంది   డీ హైడ్రేషన్ బారిన పడుతుంటారు. అంతే కాకుండా అధిక వేడికి  త్వరగా అలసటకు లోను అవుతారు.

అందువలన ఈ వేసవిలో  ఎప్పుడూ   హై డ్రేటెడ్‌గా ఉండటానికి,  తప్పనిసరిగా, శరీరానికి చలువ చేసే ఫుడ్ తీసుకోవాలని చెబుతుంటారు వైద్యులు.

అయితే వేసవిలో పెరుగుతో భోజనం చేయడం వలన అది శరీరాన్ని చల్లబరుస్తుంది. మరీ ముఖ్యంగా  దద్యోజనం ఈ సమ్మర్‌లో లంచ్ కోసం బెటర్ ఫుడ్.

కాగా, దీనిని ఇంట్లో  ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. కావాల్సిన పదార్థాలు బియ్యం పావు కేజీ, పెరుగు, పాలు, అరలీటర్,అల్లం తరుగు అర టీ స్పూన్.

ఎండు మిర్చి2 పచ్చిమిర్చి తరుగు 1స్పూన్,మిరియాలు టీ స్పూన్,మినప్పు టేబుల్ స్పూన్,శనగపప్పు, టేబుల్ స్పూన్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, నెయ్యి సరిపడా, శొఠి.

తయారీ విధానం బియ్యాన్ని నానబెట్టి, తర్వాత దానిని గ్యాస్ పై ఉడికించుకోవాలి, అన్నం మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. తర్వతా స్టవ్ పై వేరే గిన్నె పెట్టి అందులో నెయ్యి, శొంఠి వేసి వేపుకోవాలి. 

తర్వాత అదే కడాయిలో పైన చెప్పిన పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. అవి  వేగాక, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి ఫ్రై చేయాలి.

తర్వాత ఉకించుకున్న అన్నంలో ఉప్పు, పెరుగు, పాలు వేసి కలపాలి, తర్వాత తాలింపు, శొంఠి పొడి వేసి  మిక్స్ చేసుకోవాలి.తర్వాత కొత్తి మీర తరుగు వేసుకుంటే. దద్యో జనం రెడీ