Ram temple in Ayodhya: అయోధ్యలో రామాలయ నిర్మాణం.. L&T సేవలు ఉచితం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సన్నాహాలు జోరందుకుంటున్నాయి. ఈ గుడి నిర్మాణం, డిజైన్ ను తాము చేపడతామని ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థ ఎల్ & టీ ముందుకు వచ్చింది. సాంకేతికపరమైన సాయంతో బాటు నిర్మాణ ప్రాజెక్టుల బాధ్యతను తామే తీసుకుంటామని.

Ram temple in Ayodhya: అయోధ్యలో రామాలయ నిర్మాణం.. L&T సేవలు ఉచితం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2020 | 11:57 AM

Ram temple in Ayodhya:  అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సన్నాహాలు జోరందుకుంటున్నాయి. ఈ గుడి నిర్మాణం, డిజైన్ ను తాము చేపడతామని ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థ ఎల్ & టీ ముందుకు వచ్చింది. సాంకేతికపరమైన సాయంతో బాటు నిర్మాణ ప్రాజెక్టుల బాధ్యతను తామే తీసుకుంటామని. పైగా ఏ మాత్రం సొమ్ము తీసుకోకుండా ఉచితంగానే ఈ సేవలు అందిస్తామని ఈ సంస్థ సంసిధ్ధత వ్యక్తం చేసినట్టు విశ్వహిందూ పరిషద్ వర్గాలు తెలిపాయి. ఇందుకు ఈ సంస్థ ఏ కాంట్రాక్టు పైనా సంతకం చేయబోదని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన ట్రస్టీల బోర్డు, వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి ఈ కంపెనీ అధికారులతో టచ్ లో ఉంటారట. ఆలయ నిర్మాణ ప్రారంభ తేదీని నిర్ణయించేందుకు ట్రస్టీల బోర్డు అయోధ్యలో మార్చి మొదటివారంలో తమ రెండో సమావేశాన్ని నిర్వహింఛవచ్చు. ఎల్ అండ్ టీ సీనియర్ డిజైనర్ ఆర్.ఎం.వీరప్పన్ తన కంపెనీ తరఫున ఈ సమావేశానికి హాజరు కావచ్ఛునని తెలుస్తోంది. ఒక ఏజన్సీనుంచి  ఆలయ నిర్మాణ పనులు, టెక్నికల్ హెల్ప్ తీసుకోవచ్చా అనే అంశంపై ఈ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తరాదిన వైష్ణవులు పాటించే ‘నగర’ స్టయిల్ లో 270 అడుగుల పొడవునా భారీ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఒకప్పుడు కూల్చివేసిన ఆలయం మాదిరే ‘నగర’ స్టైల్ డిజైన్ ని ఎంపిక చేశారు.

Latest Articles