Rakesh Tikait: బీకేయూ నేత రాకేశ్ తికాయత్ కాన్వాయ్‌పై దాడి.. నలుగురు అరెస్ట్.. ఘాజీపూర్‌లో రైతుల ఆందోళన

Rakesh Tikait’s convoy attacked: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలల నుంచి రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో

Rakesh Tikait: బీకేయూ నేత రాకేశ్ తికాయత్ కాన్వాయ్‌పై దాడి.. నలుగురు అరెస్ట్.. ఘాజీపూర్‌లో రైతుల ఆందోళన
Rakesh Tikait
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 02, 2021 | 9:53 PM

Rakesh Tikait’s convoy attacked: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలల నుంచి రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ కాన్వాయ్‌పై శుక్రవారం దాడి జరిగింది. ఈ ఘటనలో బీకేయూ నేత తికాయత్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది. తికాయత్ అల్వార్ నుంచి బన్సూర్ వెళ్తుండగా తాతార్పూర్ గ్రామం వద్ద ఈ దాడి జరిగింది.

మధ్యాహ్నం హర్సోరాలో జరిగిన రైతు సభలో తికాయత్ ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి బన్సూర్ వెళ్తున్నారు. ఈ ఘటనపై రాకేశ్ తికాయత్ ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ గూండాలే తనపై దాడి చేశారంటూ ఆరోపించారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా తాతార్పూర్ క్రాస్‌ రోడ్డు వద్ద బీజేపీకి చెందిన గూండాలు దాడి చేశారు.. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది.. అంటూ తికాయత్ పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

రాకేశ్ తికాయత్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో..

అయితే ఈ సంఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. రాకేశ్ తికాయత్‌పై దాడి జరిగిందన్న వార్త తెలియగానే.. ఢిల్లీ ఘాజీపూర్ సరిహద్దున ఆందోళన చేస్తున్న రైతులు ఎన్‌హెచ్-9పై ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Also Read: