Road accident : ఓవర్ టర్న్ చేయబోయి పక్కన వెళ్తోన్న కారుపై పడ్డ మార్బుల్స్ లోడు లారీ, కారులో ఉన్న నలుగురూ స్పాట్ డెడ్

Rajasthan road accident : రాజస్థాన్‌ రాష్ట్రంలోని పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పక్కనుంచి వెళ్తోన్న కారుపై పాలరాళ్లు తీసుకెళ్తున్న కంటైనర్ ట్రక్కు పడింది. కంటైనర్ లారీ డ్రైవర్ ఓవర్ టర్న్..

Road accident : ఓవర్ టర్న్ చేయబోయి పక్కన వెళ్తోన్న కారుపై పడ్డ మార్బుల్స్ లోడు లారీ, కారులో ఉన్న నలుగురూ స్పాట్ డెడ్
Accident
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 02, 2021 | 9:48 PM

Rajasthan road accident : రాజస్థాన్‌ రాష్ట్రంలోని పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పక్కనుంచి వెళ్తోన్న కారుపై పాలరాళ్లు తీసుకెళ్తున్న కంటైనర్ ట్రక్కు పడింది. కంటైనర్ లారీ డ్రైవర్ ఓవర్ టర్న్ చేయబోవడంతో అదుపుతప్పి పక్కనే వెళ్తోన్న కారుపై పడిపోయింది. దీంతో కారు మొత్తం తప్పడైపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న దంపతులు సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన నలుగురూ కారులో ఉన్నారని, జిల్లాలోని బలరాయ్ గ్రామానికి సమీపంలో ఎన్‌హెచ్ -62 లో ఈ ప్రమాదం జరిగిందని ఎండ్లా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బిహారీ లాల్ శర్మ తెలిపారు. మృతుల్లో అశ్వని శర్మ, అతని భార్య రష్మి, వాళ్ల బంధువు మనోజ్ శర్మ, డ్రైవర్ బుద్ధ రామ్ ఉన్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను అందజేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి ట్రక్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read also : Hyderabad : రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలపై సీఎం కేసీఆర్‌ పగడ్భందీ యాక్షన్‌ ప్లాన్‌