ఆల్వార్ మూకదాడి కేసు.. పునర్విచారణకు ఆదేశం

ఆల్వార్ మూకదాడి కేసు విచారణ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని రాజస్థాన్‌లోని ఆల్వార్‌ కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఈ కేసు విచారణను పోలీసులు కావాలనే పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం హెహ్లూ ఖాన్‌ కేసును పునర్విచారణకు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో పోలీసులు చేస్తున్న విచారణ కూడా సరిగ్గా ఉందా […]

ఆల్వార్ మూకదాడి కేసు.. పునర్విచారణకు ఆదేశం
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 2:34 AM

ఆల్వార్ మూకదాడి కేసు విచారణ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని రాజస్థాన్‌లోని ఆల్వార్‌ కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఈ కేసు విచారణను పోలీసులు కావాలనే పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం హెహ్లూ ఖాన్‌ కేసును పునర్విచారణకు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో పోలీసులు చేస్తున్న విచారణ కూడా సరిగ్గా ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాత్ ఇది వరకే స్పష్టం చేశారు.

గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నాడనే నెపంతో 2017 ఏప్రిల్‌ 1న పెహ్లూ ఖాన్‌ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు చితకబాదారు.తీవ్ర గాయాలతో ఓ ఆస్పత్రిలో చేరిన హెహ్లూ ఖాన్‌ 2017 ఏప్రిల్ 3న చనిపోయాడు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా, వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మైనర్లు జువైనల్‌ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. హరియాణాకు చెందిన పెహ్లూ ఖాన్‌ కొన్ని ఆవులను రాజస్థాన్‌ నుంచి హరియాణాకు తరలిస్తుండగా.. ఈ ఘటన అల్వార్‌ ప్రాంతంలో జరిగింది.

Latest Articles
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు