AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రాష్ట్ర సర్కార్.. రూ.71,486 కోట్లతో 26 వేల మందికి ఉపాధి అవకాశాలు

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ యేడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తాయిలాలను ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.

Rajasthan: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రాష్ట్ర సర్కార్.. రూ.71,486 కోట్లతో 26 వేల మందికి ఉపాధి అవకాశాలు
Ashok Gehlot
Balaraju Goud
|

Updated on: Apr 25, 2022 | 3:57 PM

Share

Rajasthan Government: రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ యేడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తాయిలాలను ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రాష్ట్రంలో 26,000 మందికి పైగా ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంతో రూ.71,486 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ (బీవోఐ) రెండో సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనుకూలమైన పారిశ్రామిక విధానం వల్ల ఇప్పుడు చాలా మంది బడా పారిశ్రామికవేత్తలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఇది రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత బలం చేకూరుస్తుంది. ఇన్వెస్ట్ రాజస్థాన్ సమ్మిట్ తయారీకి సూచనలు కూడా ఇచ్చారు.

పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు లభ్యత ఉన్నందున, బికనీర్ డివిజన్‌లో సిరామిక్ హబ్ ఏర్పాటుపై నివేదిక సిద్ధం చేయాలని అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. దీంతోపాటు ఆ ప్రాంతంలో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఆమోదించబడిన ప్రాజెక్ట్‌లలో హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్, హోండా కార్స్, సెయింట్ గోబెన్, బోరోసిల్, ఒకాయ, క్రిష్ ఫార్మా, లెన్స్‌కార్ట్, రెన్యూ, హెచ్‌పిసిఎల్ మిట్టల్, సెరామాక్స్ గ్రానిటో మొదలైన కార్పొరేట్ దిగ్గజాల నుండి పెట్టుబడులు ఉన్నాయి. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో దాదాపు 26,004 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి రాంలాల్ జాట్, ముఖ్య కార్యదర్శి ఉషా శర్మ, పరిశ్రమల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి విను గుప్తా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అఖిల్ అరోరా, ప్రిన్సిపల్ సెక్రటరీ భాస్కర్ సావంత్, బీఐపీ కమిషనర్ ఇంద్రజిత్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also…  Prashant Kishor: కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికపై తర్జనభర్జనలు.. సోనియా నివాసంలో సీనియర్ నేతల కమిటీ మంతనాలు

మరిన్ని జాతీయ వార్తల కోసం….