AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Voter ID: ఓటర్ ID కార్డ్ లేకపోతే, ఈ పత్రాల ద్వారా కూడా ఓటు వేయవచ్చు.. జాబితాను చూడండి

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. గురువారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియడంతో అందరూ ఓటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ వీలైనంత ఎక్కువగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు.

Voter ID: ఓటర్ ID కార్డ్ లేకపోతే, ఈ పత్రాల ద్వారా కూడా ఓటు వేయవచ్చు.. జాబితాను చూడండి
Voter Id Card
Balaraju Goud
|

Updated on: Nov 23, 2023 | 9:17 PM

Share

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. గురువారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియడంతో అందరూ ఓటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ వీలైనంత ఎక్కువగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఇందు కోసం ఇప్పటికే ఈసీ బృందం నిరంతరం అవగాహన కల్పిస్తోంది.

ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ ఐడి కార్డు అవసరమని అందరికీ తెలుసు. అయితే ఓటరుకు ఓటర్ ఐడి కార్డు లేకపోతే, అతను ఓటు వేయడానికి ఏ పత్రాలను ఉపయోగించవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ఏ పత్రాల ద్వారా ఓటు వేయవచ్చో చూడండి..

మీరు ఈ పత్రాల ద్వారా కూడా మీ ఓటు వేయవచ్చుః

1. ఆధార్ కార్డ్

2. పాస్‌పోర్ట్

3. డ్రైవింగ్ లైసెన్స్

4. PAN కార్డ్

5. హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్

6. అధికారిక గుర్తింపు కార్డ్

7. పెన్షన్ డాక్యుమెంట్ (ఫోటోతో)

8. సర్వీస్ ఐడెంటిటీ కార్డ్

9. స్మార్ట్‌కార్డ్ (RGI ద్వారా జారీ చేయబడింది)

10. బ్యాంక్ పాస్‌బుక్ (ఫోటోతో)

11. దివ్యాంగ్ ప్రత్యేక ID

రాజస్థాన్‌లో మొత్తం ఓటర్లు – 5.29 కోట్లు

రాజస్థాన్‌లో మొత్తం 5 కోట్ల 29 లక్షల 31 వేల 152 మంది ఓటర్లు నమోదయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 1,863 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో మొత్తం 51,900 వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. వాటిలో 383 సహాయక పోలింగ్ స్టేషన్లు. అలాగే 9,500 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు అధికారులు. ఓటు వేయడానికి 90 నిమిషాల ముందు మాక్ పోల్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఓటింగ్‌కు ఇదే సమయం..

200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబర్ 25న 199 స్థానాలకు పోలింగ్ జరగనున్నాయి. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ మరణించిన తరువాత, ఇప్పుడు నవంబర్ 25న రాజస్థాన్‌లో 200 స్థానాలకు బదులుగా 199 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది. నవంబర్ 25న ఓటింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ప్రశాంతం వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..