సీమా హైదర్‌కు ఆ పార్టీ నేతలు బెదిరింపులు.. సినిమాలో నటిస్తే పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరిక

పబ్‌జీ ఆటలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇటీవల సీమా హైదర్ అనే మహిళ పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు మరొ చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం సీమా హైదర్‌కు బెదిరింపులు వస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే సచిన్, హైదర్‌ల ప్రేమకథ ఆధారంగా బాలీవుడ్ నిర్మాత అయిన అమిత్ జాని అనే అతను కరాచీ టూ నోయిడా అనే పేరుతో ఓ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సీమ హైదర్‌ను హిరోయిన్‌గా ఎంపిక చేశారు.

సీమా హైదర్‌కు ఆ పార్టీ నేతలు బెదిరింపులు.. సినిమాలో నటిస్తే పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరిక
Sachin And Seema

Edited By:

Updated on: Aug 14, 2023 | 6:31 AM

పబ్‌జీ ఆటలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇటీవల సీమా హైదర్ అనే మహిళ పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు మరొ చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం సీమా హైదర్‌కు బెదిరింపులు వస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే సచిన్, హైదర్‌ల ప్రేమకథ ఆధారంగా బాలీవుడ్ నిర్మాత అయిన అమిత్ జాని అనే అతను కరాచీ టూ నోయిడా అనే పేరుతో ఓ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సీమ హైదర్‌ను హిరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే దీనిపై రాజ్‌ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ ఆమెకు హెచ్చరికలు చేసింది. ఈ సినిమా చేయకూడని ఆదేశించింది. లేకపోతే  పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన విషయంపై ఆ పార్టీ నేత అమేయ కోప్కర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పాకిస్థాన్ పౌరులకు ఇండియన్ సినీ పరిశ్రమలో స్థానం లేదని.. ఈ వైఖరికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ప్రస్తుతం సీమ హైదర్ ఇండియాలోనే ఉంటోంది. మరోవైపు ఆమె ఐఎస్‌ఐ ఏజెంట్ అని కూడా కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. సినిరంగంలో తమ పేరు నిలబడాలనే ఉద్దేశంతో కొంతమంది నిర్మాతలు ఆమెను నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అమేయ కోప్కర్ అన్నారు. అలాంటి వారికి సిగ్గుండాలి కదా.. దీనికి వెంటనే ఆపండి.. లేదంటే చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండంటి అంటూ పేర్కొన్నారు. ఇటీవల సీమా హైదర్ కూడా సిని ఆడిషన్స్‌లో పాల్గొన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు మాజీ భర్త గులామ్ హైదర్‌ను ఇండియాకు రమ్మని సినిమా బృందం పలిచింది. పబ్‌జీలో పరిచయమై అసలు వీళ్లు ప్రేమికులుగా ఎలా మారారు.. ప్రేమలో పడిన హైదర్ ఇండియాకు ఎందుకు వచ్చింది.. ఇలాంటి విషయాలన్ని సినిమాలో చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి సీమా, సచిన్‌ల ప్రేమ కథ చాలా ఆసక్తికరంగా జరిగింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో కాలక్షేపం కోసం పబ్‌జీ ఆడుతుండగా అందులో వీరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సుమారు రెండు సంవత్సరాల వరకు ఒకరికొకరు చూసుకోని వీరు ఫస్ట్ టైమ్ ఈ ఏడాది మార్చి నెలలో నేపాల్‌లో కలుసుకున్నారు. అక్కడే వివాహం కూడా చేసుకున్నారు. అయితే సీమాకు అంతకు ముందే పెళ్లై నలుగురు పిల్లలతో కలిసి ఉంటోంది. సౌదిలో ఉంటున్నటువంటి తన భర్తను వదిలిపెట్టి సీమా సచిన్‌తో తన జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమైంది. మళ్లి పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడ తన పేరు మీద ఉన్న భూమిని 12 లక్షల రూపాయలకు అమ్మేసి.. పిల్లలతో కలిసి ఇండియాకు శాశ్వతంగా వచ్చేసింది. ముందుగా గ్రేటర్ నోయిడాలోని ఓ అద్దె ఇంట్లో సచిన్, సీమా కాపురం పెట్టారు. అయితే ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లగా.. పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం వీరు నోయిడాలోనే కలిసి ఉంటున్నారు.

సీమా హైదర్ లేటెస్ట్ వీడియో ఈ ట్వీట్‌లో..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.