దేశ రాజధానిలో అర్ధరాత్రి భారీ వర్షం..

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు పలుచోట్ల ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని..

దేశ రాజధానిలో అర్ధరాత్రి భారీ వర్షం..
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 6:30 AM

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు పలుచోట్ల ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రాబోయే మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు.. పరిసర ప్రాంతాలైన అదంపూర్, హిస్సార్, హన్సీ, జింద్‌, గోహన,గన్నూర్, బరౌట్, రోహతక్,సోనిపట్, బాఘ్‌పట్, గురుగ్రామం,నోయిడా, ఘజియాబాద్‌, ఫరిదాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.