AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ప్రయాణికులకు షాక్‌.. ఇకపై ‘యూజర్ ఛార్జీలు’

రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే షాకింగ్ న్యూస్‌ని తెలిపింది. ఆధునీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైల్‌ టికెట్‌తో పాటు

రైల్వే ప్రయాణికులకు షాక్‌.. ఇకపై 'యూజర్ ఛార్జీలు'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 18, 2020 | 8:43 AM

Share

Railway User Fee: రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే షాకింగ్ న్యూస్‌ని తెలిపింది. ఆధునీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైల్‌ టికెట్‌తో పాటు యూజర్‌ చార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయార్జనలో భాగంగా వీటిని వసూలు చేయబోతున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. అయితే ఈ ఛార్జీలు ఎక్కువగా ఉండవని ఆయన స్పష్టం చేశారు. కానీ ఈ ఛార్జీలతో కలుపుకొని టికెట్ల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకసారి స్టేషన్‌ ఆధునీకరణ పూర్తి అయ్యాక, యూజర్ ఛార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని పేర్కొన్నారు. దేశంలోని 7 వేల రైల్వే స్టేషన్లలో 10–15 శాతం స్టేషన్లలో వీటిని అమలు చేయనున్నట్లు వీకే యాదవ్ వెల్లడించారు.

అయితే రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించిన నేపథ్యంలో టికెట్ల ధరలు పెరుగుతాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రకటన రావడం గమనర్హం. కాగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 50 స్టేషన్లను ఆధునీకరించాలన్న భావనలో రైల్వే ఉంది. ఈ క్రమంలో ఆయా స్టేషన్ల కింద ఉన్న భూములను 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని రైల్వే ఆలోచిస్తుంది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్‌ హబ్‌లను రైలోపోలీస్‌గా పిలుస్తారు.

కరోనా లాక్‌డౌన్‌‌.. 66 లక్షల మంది ఉద్యోగాలు పోయాయట

ఛీ ఛీ అన్న అభిజిత్‌.. గుక్కపెట్టి ఏడ్చేసిన సుజాత

Follow Us
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..
పులి, సింహం కన్నా ఇదే అత్యంత ప్రమాదకర జంతువు..
పులి, సింహం కన్నా ఇదే అత్యంత ప్రమాదకర జంతువు..
భారత్ - న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఎవరికి
భారత్ - న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఎవరికి
పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్‌.. బంగారానికి భారీ డిస్కౌంట్‌!
పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్‌.. బంగారానికి భారీ డిస్కౌంట్‌!
సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా..
సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ!
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ!
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా