ఒలంపిక్స్ పతక విజేతలకు అభినందనలు సరే ! నీరజ్ చోప్రా, పునియాలకు పాత బకాయిల మాటేమిటి ? ప్రధాని మోదీకి రాహుల్ ప్రశ్న
టోక్యో ఒలంపిక్స్ పతక విజేతలకు అభినందనలు, ఫోన్ కాల్స్ మాట సరే.. 2018 లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన విన్నర్స్ కి ప్రామిస్ చేసిన రివార్డు సంగతేమిటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ..ప్రధాని మోదీని ప్రశ్నించారు.
టోక్యో ఒలంపిక్స్ పతక విజేతలకు అభినందనలు, ఫోన్ కాల్స్ మాట సరే.. 2018 లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన విన్నర్స్ కి ప్రామిస్ చేసిన రివార్డు సంగతేమిటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ..ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఆ అథ్లెట్ల ‘బకాయిలు’ ఇంకా తీర్చాల్సి ఉందన్నారు. కంగ్రాచ్యులేషన్స్ తో బాటు వారికి ఇస్తామన్న నజరానా కూడా ఇవ్వాల్సి ఉందన్నారు. క్రీడా బడ్జెట్లలో ఈ విభాగానికి కేటాయించే నిధుల్లో కోత విధించడం కాదు.. హర్యానా ఒలంపియన్లకు క్యాష్ రివార్డులు ప్రకటించి నాలుగేళ్లయింది అంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ఇచ్చిన వార్తను ఆయన తన ట్వీట్ కి జోడించారు. అలాగే మెడల్ సాధిస్తామన్న ఆశతో టోక్యోకు వెళ్లిన వారికి చెల్లించవలసిన లక్షలాది రూపాయల రివార్డును కూడా ఇప్పటికీ చెల్లించలేదని ఈ వార్త పేర్కొంది. 2019 జూన్ 26 న నీరజ్ చోప్రా, బజరంగ్ పునియా చేసిన ట్వీట్లను రాహుల్ ప్రస్తావించారు. రివార్డు సొమ్ముకు తాము వెంపర్లాడడం లేదని, కానీ మీ హామీతో ఏ ప్లేయరైనా భవిష్యత్తులో ఉత్సాహంగా ఆడతాడని.. మీ హామీ తీర్చుకుంటారని ఆశిస్తాడని పునియా నాడు ట్వీట్ చేశాడు. ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించినందుకు 3 కోట్ల రూపాయల రివార్డు ఇస్తామని నాడు హర్యానా సీఎం ఖట్టర్, హోం మంత్రి అనిల్ విజ్ ట్వీట్ చేశారు.
అటు నీరజ్ చోప్రా కూడా పునియా వ్యాఖ్యలతో ఏకీభవించాడు. చోప్రా ఆ గేమ్స్ ల్లోనూ గోల్డ్ మెడల్ సాధించాడు. జావెలిన్ త్రో లో భారత తొలి ఏషియన్ గేమ్స్ బంగారు పతక విజేత అయ్యాడు. వీరికి ఆ నాటి రివార్డు అందాల్సి ఉందని ఈ వార్త పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.