Amit Shah: రాహుల్‌ గాంధీ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు.. హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం..

అమెరికాలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశవ్యతిరేక మాటలు మాట్లాడటం, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులకు అండగా నిలవడం రాహుల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి అలవాటుగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విమర్శించారు.

Amit Shah: రాహుల్‌ గాంధీ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు.. హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం..
Amit Shah - Rahul Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 11, 2024 | 1:32 PM

లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలను మళ్లీ హీటెక్కించాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రజాస్వామ్యం, భారతీయ జనతా పార్టీ తీరు, ఆర్ఎస్ఎస్, ఎన్నికలు, రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. గత పదేళ్లలో భారతదేశ ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని, కానీ ప్రస్తుతం దానిని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వివరించారు. అయితే.. అమెరికాలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశవ్యతిరేక మాటలు మాట్లాడటం, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులకు అండగా నిలవడం రాహుల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి అలవాటుగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విమర్శించారు. విదేశీగడ్డపై భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశానికి చేటు కలిగిస్తున్నారని ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశ భద్రత, మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు.. భాషపరంగా, ప్రాంతంపరంగా, మతపరంగా విభజన మాటలు మాట్లాడటం రాహుల్‌ గాంధీ విభజన ఆలోచనను తెలియజెప్తోందని అమిత్ షా విమర్శించారు. రిజర్వేషన్ల గురించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలనూ అమిత్‌ షా తప్పుబట్టారు. దేశంలో రిజర్వేషన్‌ను రద్దు చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక ముఖాన్ని దేశం ముందు తీసుకొచ్చారన్నారు. మనస్సులోని ఆలోచనలు ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో బయటపడుతుంటాయి.. బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్‌ను ఎవరూ ముట్టుకోలేరని, దేశ సమైక్యతతో ఎవరూ ఆడుకోలేరని రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నానంటూ అమిత్ షా స్పష్టంచేశారు.

అమిత్ షా ట్వీట్..

జమ్మూ కాశ్మీర్‌లో JKNC దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..