అంబానీ కోడలి హ్యాండ్‌ బ్యాగ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. మనమైతే ఓ ఫ్లాటే కొనుక్కోవచ్చు.

భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ నిర్మించిన అద్భుత కట్టడం నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (NMACC) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలీవుడ్ సినీతారలు అందరూ తరలివచ్చారు...

అంబానీ కోడలి హ్యాండ్‌ బ్యాగ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. మనమైతే ఓ ఫ్లాటే కొనుక్కోవచ్చు.
Radhika
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 02, 2023 | 5:28 PM

భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ నిర్మించిన అద్భుత కట్టడం నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (NMACC) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలీవుడ్ సినీతారలు అందరూ తరలివచ్చారు. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకలో అంబానీ కుటుంబానికి కాబోయే కోడలు రాధిక మర్చంట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ త్వరలోనే వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన NMCC ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాధిక మర్చంట్‌ అందరి దృష్టిని ఆకర్షించారు.

ముఖ్యంగా ఆమె చేతిలో ఉన్న చిన్న బ్యాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బ్యాగ్‌ ధరపై ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్‌లో వార్తలు హల్చల్‌ చేస్తున్నాయి. సిల్వర్‌ కలర్‌లో ఉన్న ఈ చిన్న బ్యాగ్ ధర అక్షరాల రూ. 52 లక్షలు. ఈ చిన్న బ్యాగ్‌ ధరతో హైదరాబాద్‌లాంటి నగరంలో అపార్టెమెంట్‌లో ఏకంగా ఓ ఫ్లాట్‌నే కొనుగోలు చేసుకోవచ్చన్నమాట. హెర్మిస్‌ అనే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌ ఈ బ్యాగ్‌ను తయారు చేసింది.

Radhika Merchant Bag

ఇవి కూడా చదవండి

సిల్వర్‌ రంగులో ఉన్న ఈ హెర్మిస్‌ కెల్లీమోర్ఫోస్‌ బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్‌మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రాప్, క్లోచెట్‌తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉన్నాయి. ఈ బ్యాగ్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ బ్యాగ్‌ను తయారు చేసిన కంపెనీ హెర్మిస్‌ కెల్లీమోర్ఫోస్‌ పేరిట ఆభరణాలను కూడా విడుదల చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..