మాజీ సీఎం ఇంట అత్తా కోడళ్ల సవాల్
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట అత్తా కోడళ్ల పోరు కొనసాగుతోంది. అత్త రబ్రీదేవి తనను జుట్టుపట్టి కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది కోడలు ఐశ్వర్య. తన తండ్రి, ఎమ్మెల్యే చంద్రికారాయ్‌కు సంబంధించిన అసభ్యకర పోస్టర్లు బీఎన్ కళాశాల గోడలపై ప్రత్యక్షమవడంపై అత్తను ప్రశ్నించడంతో వివాదం మొదలైందని..దీంతో తనపై దాడి చేశారని అంటోంది. భర్త తేజ్ ప్రతాప్ యాదవ్, ఆడపడుచు మీసాభారతిలు అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని […]
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట అత్తా కోడళ్ల పోరు కొనసాగుతోంది. అత్త రబ్రీదేవి తనను జుట్టుపట్టి కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది కోడలు ఐశ్వర్య. తన తండ్రి, ఎమ్మెల్యే చంద్రికారాయ్‌కు సంబంధించిన అసభ్యకర పోస్టర్లు బీఎన్ కళాశాల గోడలపై ప్రత్యక్షమవడంపై అత్తను ప్రశ్నించడంతో వివాదం మొదలైందని..దీంతో తనపై దాడి చేశారని అంటోంది. భర్త తేజ్ ప్రతాప్ యాదవ్, ఆడపడుచు మీసాభారతిలు అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని కంప్లైంట్‌లో పేర్కొంది. ఐతే ఐశ్వర్య ఇలాంటి ఆరోపణలు చేయడం ఇది రెండోసారి. ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్ 498ఏ, 323,34 చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు పోలీసులు.
ఇదిలా ఉంటే కోడలే తనను చిత్రహింసలకు గురిచేస్తోందని..తన అనుచరుడు శక్తియాదవ్‌తో సెక్రటేరియట్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు రబ్రీదేవి. ఐతే కోడలు ఐశ్వర్యపై అత్త రబ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదును ఆమె తండ్రి చంద్రికారాయ్ కొట్టిపడేశారు. తన కుమార్తెకు పెద్దలను గౌరవించడం నేర్పించామని..తన కూతురు ఎప్పటికీ అలా చేయదన్నారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరతామని స్పష్టం చేశారు.
లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యారాయ్‌ల వివాహం గతేడాది మేలో జరిగింది. ఐతే వీరి వివాహం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. పెళ్లైన 6 నెలలకే అంటే 2018 నవంబర్‌లో తేజ్ ప్రతాప్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం విడాకుల కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది.