Wood Smuggling: తగ్గేదే లే.. ఏకంగా పుష్ప స్టైల్లోనే నదిలో కలప స్మగ్లింగ్.. కానీ చిక్కేశారు..

|

Aug 29, 2022 | 8:54 AM

నర్సింగపూర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నదుల్లో వరదలు వచ్చినప్పుడు స్మగ్లర్లు బరంజ్ నదిలో లక్షల రూపాయల విలువైన టేకు కలపను అక్రమంగా తరలించడం ప్రారంభించారని తెలిసి అటవీ శాఖ అధికారులు షాక్ తిన్నారు.

Wood Smuggling: తగ్గేదే లే.. ఏకంగా పుష్ప స్టైల్లోనే నదిలో కలప స్మగ్లింగ్.. కానీ చిక్కేశారు..
Teak Woods Smuggled
Follow us on

Wood Smuggling: సినిమాలకు సమాజానికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాలోని సన్నివేశాలతో ప్రజలు ప్రభావితమవుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తే.. సమాజంలో జరిగే వాటినే తాము సినిమాల్లో చూపిస్తున్నామంటూ.. పరిశ్రమకు చెందివారు చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కలప స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమా సినీ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాతలో ప్రస్తుతం కలపను స్మగ్లింగ్ చేస్తూ.. సంచలనం సృష్టిస్తున్నారు కొందరు నిందితులు.

మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్ జిల్లాలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ తరహాలో బరంజ్ నదిలోకి టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. ఇన్‌ఫార్మర్ల సమాచారంతో అటవీశాఖ అధికారులు దాడులు చేయగా కలప అక్రమ రవాణా బట్టబయలైంది. నలుగురు కలప స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 52 సంవత్సరాల నిల్వ టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

నర్సింగపూర్ జిల్లాలోని టెండుఖేడా ప్రాంతంలోని బర్మన్ ఫారెస్ట్ రేంజ్‌లోని అలన్‌పూర్ బీట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అలన్పూర్ బీట్ నర్సింగపూర్, సాగర్ జిల్లాల అటవీ సరిహద్దుకు ఆనుకొని ఉంది. సమీపంలో బరంజ్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిని వేదికగా చేసుకుని టేకు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. బరంజ్ నది వెంబడి ఉన్న ప్రాంతపు కలప స్మగ్లర్లు విలువైన టేకు కలపను అక్రమంగా తరలించేందుకు పుష్ప సినిమాలోని సన్నివేశాన్ని అనుకరించారు.

లక్షల రూపాయల విలువైన కలప:
గతంలో నర్సింగపూర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నదుల్లో వరదలు వచ్చినప్పుడు స్మగ్లర్లు బరంజ్ నదిలో లక్షల రూపాయల విలువైన టేకు కలపను అక్రమంగా తరలించడం ప్రారంభించారని తెలిసి అటవీ శాఖ అధికారులు షాక్ తిన్నారు. ఈ అక్రమ రవాణాపై కొందరు ఇన్‌ఫార్మర్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇన్ ఫార్మర్ల సమాచారంతో అటవీశాఖ అధికారులు, బీట్ గార్డులు రాత్రి పగలు పెట్రోలింగ్ చేశారు. ఇలా రెండు రాత్రులు, ఒక పగలు అధికారులు అక్కడ ఉండి.. ప్రవహిస్తున్న నది ద్వారా స్మగ్లింగ్ చేస్తోన్న 52 టేకు కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

అలన్‌పూర్ బీట్ బర్మన్ రేంజ్ బీట్ ఇన్‌చార్జి భూపేంద్ర ఠాకూర్ మాట్లాడుతూ బరంజ్ నదిపై రాత్రి వేళల్లో కలపను అక్రమంగా కొందరు వ్యక్తులు తరలిస్తున్నట్లు తమ సమాచారం అందిందని తెలిపారు. దీంతో రెండు రాత్రులు, ఒక పగలు కష్టపడి.. అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను పట్టుకోవడంలో విజయం సాధించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..