Rape Accused Punishment: అత్యాచారం చేసిన వారికి ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా…?

Rape Cccused Punishment: దేశంలో అత్యాచార ఘటనలో రోజుకు ఎన్నో జరుగుతున్నాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని...

Rape Accused Punishment: అత్యాచారం చేసిన వారికి ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా…?
Follow us

|

Updated on: Jan 27, 2021 | 5:35 AM

Rape Accused Punishment: దేశంలో అత్యాచార ఘటనలో రోజుకు ఎన్నో జరుగుతున్నాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. జరుగుతూనే ఉన్నాయి. అయితే అత్యాచారాలు చేస్తే ఒక్కో దేశంలో ఒక్క విధంగా శిక్షలు అమలు చేస్తున్నారు. అయితే ప్రపంచంలోని వివిధ దేశాల్లో పలు రకాల శిక్షలు విధిస్తున్నారు. ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారంటే..

– భారత్‌లో రేప్ కేసుకు సంబంధించి వివిధ రకాల శిక్షలు పడతాయి. 14 ఏళ్ల నుంచి జీవితఖైదు పడొచ్చు. కేసు తీవ్రతను బట్టి ఉరిశిక్ష కూడా పడుతుంది.

– ఫ్రాన్స్‌లో 15 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష

– ఉత్తరకొరియాలో అత్యాచారం దోషులను కాల్చి చంపుతారు.

– అఫ్ఘనిస్తాన్ తల మీద కాల్చిచంపుతారు. లేకపోతే ఉరిశిక్ష వేస్తారు.

– చైనాలో మరణ శిక్ష వేస్తారు. కొన్ని సందర్భాల్లో బతికి ఉండగానే ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి శిక్షలు వేస్తారు.

– సౌదీ అరేబియాలో అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిన కొన్ని రోజుల్లోనే బహిరంగంగా నిందితులను తల నరుకుతారు.

– ఇరాన్‌లో ఉరిశిక్షను విధిస్తారు

– ఈజిప్ట లో ఉరిశిక్షను అమలు చేస్తారు.

– ఇజ్రాయెల్లో 16 సంవత్సరాలపాటు జైలు శిక్ష విధిస్తారు.

– అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానంగా శిక్ష అమలు చేస్తారు. కొన్నేళ్లు జైలు శిక్ష, లేకపోతే జీవితకాల శిక్ష విధిస్తారు.

– రష్యాలో మూడేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

Also Read: Shot Dead: రాజస్థాన్‌లో దారుణం.. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు గన్‌తో..