AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Buses: 150 ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్డర్‌ చేసిన పుణె మహానగర పరివహన్‌ మహామండల్‌

Electric Buses: 150 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం పుణె మహానగర పరివహన్‌ మహామండల్‌ అనుమతి ఇచ్చింది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌, ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ ..

Electric Buses: 150 ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్డర్‌ చేసిన పుణె మహానగర పరివహన్‌ మహామండల్‌
Subhash Goud
|

Updated on: Dec 30, 2020 | 7:01 PM

Share

Electric Buses: 150 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం పుణె మహానగర పరివహన్‌ మహామండల్‌ అనుమతి ఇచ్చింది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌, ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ పీఎంపీఎల్‌కు 150 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయనుంది. అయితే బిడ్‌లో అతి తక్కువ కోట్‌ చేసి ఆర్డర్‌ దక్కించుకుంది ఇవీ ట్రాన్స్‌. ఈ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుల పొడవు 12 మీటర్లు కాగా, 33 మంది ప్రయాణికుల సీటింగ్‌ సామర్థ్యం ఉంటుంది. అంతే కాకుండా వీల్‌ చెయిర్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ప్యాసింజర్ల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను సైతం ఏర్పాటు చేయనుంది.

అలాగే ఈ బస్సుల్లో దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌ చెయిర్‌ ర్యాంప్‌ సౌకర్యం ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్‌, యూఎస్‌బీ సాకెట్‌ వంటి సదుపాయాలుంటాయి. ఈ బస్సులకు లిథియమ్‌ -ఇయాన్‌ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగల సామర్థ్యంతో తయారు చేయనున్నారు. ప్రత్యేకమైన రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌ సిస్టం, 2 నుంచి 5 గంటల్లో బ్యాటరీ మొత్తం చార్జింగ్‌ అవుతుంది.

మెగా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ, ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ 2015లోనే దేశంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టాయి. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో అగ్రగామి నిలిచిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ ఈ బస్సులను సరఫరా చేయనుంది. అయితే 150 బస్సులకు పుణె మహానగర్‌ పరివహన్‌ మహామండల్‌ లిమిటెడ్‌ అనుమతి ఇవ్వగా, భారత ప్రభుత్వ ఫేమ్‌ -2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా కానున్నాయి. అయితే ఒలెక్ట్రా టెక్‌ నుంచి బస్సులను ఇవీ ట్రాన్స్‌ సేకరించనుంది. కొత్త ఆర్డర్‌తో కలిపి ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ ఇప్పటి వరకు 900పైగా ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేసింది. అయితే ఈ బస్సులను 10 నుంచి 12 సంవత్సరాల వ్యవధిలో సరఫరా చేయనుంది.

WhatsApp New Features 2020: ఈ ఏడాది వాట్సాప్ తీసుకువచ్చిన టాప్ 10 బెస్ట్ ఫీచ‌ర్లు ఏంటో తెలుసా..?