పుదుచ్చేరిలోని పిల్లల్లో 10 శాతం పెరిగిన కోవిడ్ కేసులు.. హై అలర్ట్.. విశాఖ జిల్లాలో 5 కేసులు

Umakanth Rao

Umakanth Rao | Edited By: Janardhan Veluru

Updated on: Jul 17, 2021 | 2:35 PM

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని పిల్లల్లో 10 శాతం కోవిడ్ కేసులు పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెకండ్, థర్డ్ వేవ్ మధ్య గల ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో కరోనా వైరస్ కేసులు..

పుదుచ్చేరిలోని పిల్లల్లో 10 శాతం పెరిగిన కోవిడ్  కేసులు.. హై అలర్ట్.. విశాఖ జిల్లాలో 5 కేసులు
Children Vaccine

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని పిల్లల్లో 10 శాతం కోవిడ్ కేసులు పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెకండ్, థర్డ్ వేవ్ మధ్య గల ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో కరోనా వైరస్ కేసులు.. ముఖ్యంగా పిల్లల్లో పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాము బాలలకు సంబంధించి హాస్పిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ని, ఐసీయూ, బెడ్స్ సదుపాయాలను పెంచామని ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.అరుణ్ తెలిపారు. పది శాతం కేసులు పీడియాట్రిక్ అని, తలిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని.. కోవిడ్ ప్రొటొకాల్స్ పాటిస్తూ తమ బిహేవియర్ ని తదనుగుణంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ కేసులు పెరగకుండా చూసుకోవలసిన బాధ్యత పెరెంట్డ్స్ పై ఉందని, వారు తమ పిల్లలను బయటకు పంపరాదని, అలాగే తమ కుటుంబాలలోకి బయటివారిని గానీ, బంధువులను గానీ ఆహ్వానించరాదని ఆమె సూచించారు.

ప్రస్తుతం 16 మంది పిల్లలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. వారికి నాణ్యమైన చికిత్స అందుతోందన్నారు. నిన్న పుదుచ్చేరిలో కొత్తగా 104 కి పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీ..విశాఖ జిల్లాలో పిల్లలకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆరేళ్ళ చిన్నారి కూడా ఉన్నాడు. తాము ఎంత జాగ్రత్తలు పాటించినా.. వ్యాక్సిన్ తీసుకున్నా పిల్లలకు ఈ వ్యాధి సోకడం పట్ల తలిదండ్రులు కలవరపడుతున్నారు. అందువల్లే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్.. తమిళిసై సౌందరరాజన్.బయటివారిని కుటుంబాలు ఆహ్వానించరాదని పదేపదే సూచిస్తున్నారు. .

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కరోనా కాలపు చదువులు ఇలాగే ఉంటాయి.. వైరల్‌ అవుతోన్న చిన్నారి మాటలు. హోం వర్క్‌ తప్పించుకోవడానికి.

Bank Holidays: ఆ ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. వెల్లడించిన ఆర్బీఐ.. ఎక్కడెక్కడ అంటే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu