AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PUBG: పబ్‌జీ.. ప్రియులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే దేశంలో లాంచ్.. ఏం పేరు పెట్టారో తెలుసా..?

PUBG Mobile India: పబ్‌జీ.. గేమ్‌ అంటే.. చాలు చాలామంది స్మార్ట్ ఫోన్ ప్రియులు దానికే అతుక్కుపోతుంటారు. పబ్ జీ కోసం ఇప్పటికీ.. చాలామంది నిరీక్షిస్తున్నారు. అయితే అంత

PUBG: పబ్‌జీ.. ప్రియులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే దేశంలో లాంచ్.. ఏం పేరు పెట్టారో తెలుసా..?
Pubg Mobile India
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 04, 2021 | 8:59 PM

PUBG Mobile India: పబ్‌జీ.. గేమ్‌ అంటే.. చాలు చాలామంది స్మార్ట్ ఫోన్ ప్రియులు దానికే అతుక్కుపోతుంటారు. పబ్ జీ కోసం ఇప్పటికీ.. చాలామంది నిరీక్షిస్తున్నారు. అయితే అంత క్రేజ్‌ ఉన్న పబ్‌జీ గేమ్‌ చైనా దేశానికి చెందినది కావడంతో గతేడాది సెప్టెంబర్‌ 2న కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పబ్ జీ తోపాటు పలు యాప్‌లపై నిషేధం విధించింది. భారత్‌-చైనాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం 118 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది. అప్పటి నుంచి పబ్‌జీ ప్రియులు ఆ గేమ్‌ భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందా…? అంటూ ఎంతో ఆశగా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో పబ్‌జీ సంస్థ తన ఆడియన్స్‌ కోసం అప్పుడప్పుడు చిన్నచిన్న అప్‌ డేట్‌లతో వాళ్లలో ఆశలు రేకెత్తించేలా చేసింది. తాజాగా పబ్‌జీ మాతృ సంస్థ పబ్‌జీ పేరును ‘బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా’ గా మారుస్తు కొత్త పోస్టర‍్లను విడుదల చేసింది. దీనికి సంబంధించి పబ్‌జీ సంస్థ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టర్లను షేర్‌ చేసింది. దీంతో పబ్‌జీ గేమ్‌ త్వరలో ఇండియాలో విడుదల కాబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ సంస్థ గత కొంత కాలంగా భారతదేశంలో తన గేమ్‌ను తిరిగే ప్రారంభించేందుకు ఉద్యోగుల నియామకాన్ని వేగం చేసింది. క్రాఫ్టన్ సంస్థ ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ లింక్డిన్‌ లో పోస్టింగ్‌ లను అప్‌ డేట్‌ చేస్తుంది. వారం రోజుల క్రితం గవర్నమెంట్‌ రిలేషన్‌ మేనేజర్‌ పోస్ట్‌కు రిక్రూట్‌ మెంట్‌ నిర్వహించింది. దీంతో పాటు ప్రధాని మోడీ పీఎం కేర్స్‌కు రూ.1.5కోట్లు విరాళం ప్రకటించింది. తమ వంతు సాయంగా భారత్‌ ను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ క్రాఫ్టన్‌ సీఈఓ చాంగ్హాస్‌ కిమ్‌ కూడా ప్రకటించారు. ఏదీఏమైనా పబ్‌జీ ప్రియులకు ఈ వార్త శుభవార్త అని పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

CORONA SECOND-WAVE: దేశంలో కరోనా విలయ తాండవం.. లోకల్ లాక్‌డౌన్లతో కట్టడికి ప్రభుత్వాల యత్నం

‘అమ్మ క్యాంటీన్’ బోర్డులను ఎత్తి పడేస్తున్న డీఎంకే కార్యకర్తలు, సస్పెండ్ చేసిన పార్టీ నాయకత్వం