PM Modi: అమృత్‌సర్‌కు ప్రధాని మోడీ.. బాబా గురీందర్ సింగ్ తో భేటీ.. పలు కీలక నిర్ణయాలు..

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అమృత్‌సర్‌లోని బియాస్‌ రాధా సోమీ సత్సంగ్‌కు చేరుకున్నారు. బాబా గురీందర్ సింగ్ థిల్లాన్‌ను కలవనున్న ప్రధాని పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బాబా గురీందర్ సింగ్ ధిల్లాన్..

PM Modi: అమృత్‌సర్‌కు ప్రధాని మోడీ.. బాబా గురీందర్ సింగ్ తో భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
Pm Modi

Updated on: Nov 05, 2022 | 1:09 PM

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అమృత్‌సర్‌లోని బియాస్‌ రాధా సోమీ సత్సంగ్‌కు చేరుకున్నారు. బాబా గురీందర్ సింగ్ థిల్లాన్‌ను కలవనున్న ప్రధాని పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బాబా గురీందర్ సింగ్ ధిల్లాన్ నాయకత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌బీ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉందని ప్రధాని ట్వీట్‌ చేశారు. డేరా బాబా జైమల్ సింగ్ అని కూడా పిలువబడే రాధా సోమీ సత్సంగ్.. అమృత్‌సర్ నుంచి దాదాపు 45 కిలోమీటర్లు దూరంలోని బియాస్ పట్టణంలో ఉంది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో ఆయనకు అనుచరులు ఉన్నారు. నవంబరు 12న హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ఆసక్తికరంగా మారింది. ఎలక్షన్స్ కు ముందు పీఎం సుందర్‌నగర్, సోలన్‌లలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.

కాగా.. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలకు నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ గతంలోనే షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. 80 ఏళ్లు పైబడిన పౌరులు ఇంటి నుంచే ఓటు వేయవచ్చని చెప్పారు. అలాగే 18 ఏళ్లు నిండిన యువకులు త్వరగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. 17 ఏళ్లు దాటిన యువకులకు కూడా ముందస్తు దరఖాస్తు సౌకర్యం ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 68 స్థానాలకుగాను బీజేపీ 44, కాంగ్రెస్‌ 21 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే.. 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీ వరసగా గెలవలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..